NTR Heroine: దర్శకుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేశారు. దేవర సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవుతుందో అంటూ అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా వారి విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ నటి జాన్వి కపూర్ దేవర సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Also Read: రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఒకప్పటి ఎన్టీఆర్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు కొన్ని అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ లేటెస్ట్ ఫోటోలలో ఆమె ఎవరో కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో సుబ్బు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలోని పాటలు మాత్రం అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందింది. రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి బాగా ఆదరణ పొందాయి. అయితే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో సుబ్బు సినిమాలో నటించారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించిన హీరోయిన్ సోనాలి జోషి ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. అయితే సుబ్బు సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి కూడా తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. సుబ్బు సినిమా తర్వాత సోనాలి తెలుగులో సందడే సందడి, నేను నాన్న అబద్ధం, రాంబాబు గాడి పెళ్ళాం వంటి సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో సోనాలి కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.