Middle class Cars : భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఒకప్పుడు కారు కొనాలంటే భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు సొంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇలాంటివారు ఎక్కువగా కోరుకునేది కారు మైలేజ్ తో పాటు బడ్జెట్లో రావాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా కొన్ని మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇవి తక్కువ ధరతో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇప్పటికే వచ్చిన కార్లకు దీటుగా మరికొన్ని కార్లు రెడీ అవుతున్నాయి. వీటిని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ కార్లు ఏవంటే?
Also Read : కొత్త కారు కావాలా.. రూ. 10 లక్షల లోపు 3 అదిరిపోయే కార్లు రాబోతున్నాయ్
సాధారణంగా నేటి కాలంలో ఏ కారు అయినా రూ. 10 లక్షల వరకు ఉంటుంది. అయితే కొంతమంది 10 లక్షల లోపు కార్లు ఉన్నవాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఎస్యువీలు సైతం రూ.10 లక్షల లోపు అందించేందుకు కొన్ని కంపెనీలు రెడీ అయ్యాయి. ఆ కంపెనీల వివరాల్లోకి వెళితే..
దేశంలోని ఆటోమొబైల్ రంగాల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్న టాటా కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కంపెనీకి చెందిన కొత్త కారు ఒకటి మార్కెట్లోకి రాబోతుంది. అదే ఆల్ట్రోజ్ పేస్లిప్ట్. ఈ మోడల్ హ్యచ్ బ్యాక్ వేరియంట్ లో ప్రీమియం లుక్ లో త్వరలో రోడ్లపైకి రాబోతుంది.. ఇందులో కొత్తగా డాష్ బోర్డు ఆకర్షిస్తుంది. అలాగే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మే 3 ఇంజన్లు కలిగి ఉంటాయి. అలాగే సిఎన్జి కూడా టెస్టింగ్ లో ఉంది. ఈ మోడల్ రూ. 6.65 లక్షల ప్రారంభ ధర నుంచి ఉండే అవకాశం ఉంది.
రెనాల్ట్ కంపెనీకి ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి సెవెన్ సీటర్ కారు అందుబాటులోకి రాబోతుంది. అదే ట్రైబల్ ఫేస్ ఫేస్ లిఫ్ట్. ఆకర్షనీయమైన డిజైన్తో ఉన్న ఈ మోడల్ ఇంటీరియర్ లో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ మోడల్ రూ.6.15 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉంది.
నిస్సాన్ కంపెనీ నుంచి సెవెన్ సీటర్ కంపాక్ట్ ఎంపీ వి రాబోతుంది. సెవెన్ సీటర్ కారును కావాలని అనుకునే వారికి ఇది మంచి ఎంపీ కానీ అంటున్నారు. స్టైలిష్ లుక్ తో ఉన్నాయి కారు లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ కారు రూ. 6 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. అలాగే రెనాల్ట్ కంపెనీకి చెందిన కైగర్ ఫేస్ లిఫ్ట్ కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు.
Also Read : బడ్జెట్ రెడీ చేసుకోండి.. త్వరలో హ్యుందాయ్ నుంచి 3 కొత్త SUVలు