NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోల ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుంది. ‘శ్రీ నందమూరి తారక రామారావు’ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క స్థాయిని పెంచుతూ ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. ఇక ప్రస్తుతం తన తోటి హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో తను కూడా పాన్ ఇండియా సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో దేవర (Devara) అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికి భారీ కలెక్షన్స్ మాత్రం కొల్లగొట్టలేకపోయింది… ఈసారి ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ సలార్ 2 (Salaar 2) సినిమా చేయాల్సి ఉన్నప్పటికి ప్రభాస్ ఫౌజీ (Fouji) సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం నుంచి ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Raed : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఎందుకంటే ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ఆయనతో సినిమా చేస్తే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుంటుంది. తద్వారా ఈ సినిమా మీద హైప్ కూడా విపరీతంగా పెరుగుతుంది.
ఇక పాన్ ఇండియా డైరెక్టర్ కావడం వల్ల అలాగే ప్రభాస్ (Prabhas) కి సలార్ రూపంలో భారీ సక్సెస్ ని అందించి 700 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన దర్శకుడు కావడం వల్ల అతనితో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించారు.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తుంది. తద్వారా ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు.పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!