Homeఅంతర్జాతీయంamerica imperialism : అప్పుడు పాకిస్తాన్.. ఇప్పుడు వెనిజులా.. అమెరికా సిద్ధాంతం అదే!

america imperialism : అప్పుడు పాకిస్తాన్.. ఇప్పుడు వెనిజులా.. అమెరికా సిద్ధాంతం అదే!

america imperialism : ప్రస్తుతం ప్రపంచ దేశాలు పకడ్బందీ భద్రత వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. యుద్ధ విమానాలు, మిస్సైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టం.. ఇలా అనేక రకాలుగా శత్రు దేశాల నుంచి తమను తాను కాపాడుకుంటున్నాయి. తమ గగనతలంలో ఏదైనా దేశానికి సంబంధించిన విమానం ప్రవేశిస్తే వెంటనే రెస్పాండ్ అయిపోతాయి. దానికి కౌంటర్ ఆపరేషన్ మొదలుపెడుతాయి. ఉదాహరణకు చైనా ఎయిర్ బెలూన్లను ఆ మధ్య అమెరికా మీదకు పంపించింది. అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ వెంటనే పసిగట్టి ఆ బెలూన్లను ధ్వంసం చేసింది.

వెనిజులాకు కూడా బలమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. అమెరికా విమానాలు ఆ దేశంలోకి ప్రవేశిస్తుంటే ఎందుకు వెనిజులా గగనతల రక్షణ వ్యవస్థ స్పందించలేకపోయింది? అమెరికా యుద్ధ విమానాలు వచ్చి.. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన సతీమణిని తీసుకెళ్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందులోను వ్యక్తమవుతున్నాయి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆయన ఒక్కసారిగా ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు పాల్పడిన ఆల్ ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నట్టు తెలియడంతో.. అంతం చేయాలని అమెరికా దళాలకు ఆదేశాలు ఇచ్చారు.. లాడెన్ తలదాచుకున్న అబోటోబాద్ లో అమెరికా దళాలు తమ విమానాలతో దిగాయి. అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ఆ తర్వాత లాడెన్ ను అంతం చేసి.. సముద్రంలో వేశాయి. ఈ ఆపరేషన్ చేపట్టిన తర్వాత అమెరికా కీలక ప్రకటన చేసింది. అప్పటిదాకా కూడా ఈ విషయం పాకిస్తాన్ దేశానికి తెలియదు.

అమెరికా యుద్ధ విమానాలు వచ్చిన విషయం కూడా పాకిస్తాన్ కు తెలియదా? అలా అనుకుంటే తప్పే. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అమెరికా యుద్ధ విమానాలకు సహకరించింది. అందువల్లే అమెరికా లాడెన్ ను అంతం చేయగలిగింది. తమ దేశంలోకి అమెరికా విమానాలు వచ్చినట్టు తెలియదని పాకిస్తాన్ చెప్పింది. కానీ ఆ విషయాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా నమ్మలేదు. లాడెన్ ను చంపిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఒబామా ఎన్నికయ్యారు.

ఇప్పుడు వెనిజులా ప్రాంతంలో కూడా సేమ్ పాకిస్తాన్ పాటర్న్ ను అమెరికా అమలు చేసింది. వెనిజులా ప్రాంతంలో ఉన్న సైన్యం సహకారంతో ఆ దేశం పైకి యుద్ధ విమానాలను మోహరించింది. ముందుగా దాడులు చేయించింది. ఆ తర్వాత అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని అరెస్ట్ చేయించింది. అనంతరం వారిని న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టింది. అప్పుడు లాడెన్ ను అంతం చేయడం వెనుక.. ఇప్పుడు మదురో ను అరెస్ట్ చేయడం వెనుక ఉన్న కారణాలు వేరువేరేం కావు. అవన్నీ కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి.. అమెరికా దోపిడీ విధానానికి .. అణిచివేత సిద్ధాంతానికి బలమైన కారణాలు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular