NTR vs Anantapur MLA : రీసెంట్ గానే అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఫైర్ అయ్యారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘వార్ 2′(War 2 Movie) సినిమాని విడుదల చేస్తే అసలు ఒప్పుకునేది లేదని, మా లోకేష్ కి వ్యతిరేకంగా ఎలా వెళ్తాడు అంటూ ఎవ్వరు వినలేని దరిద్రమైన భాషతో ఎన్టీఆర్ ని ఆయన తల్లి ని దుర్భాషలాడాడు. ఆ తర్వాత వెంటనే ఒక వీడియో బైట్ ని విడుదల చేస్తూ ఎన్టీఆర్ ని నేను అసలు ఈ అనలేదని, వార్ 2 ప్రీమియర్ షోస్ ప్రశాంతవంతమైన వాతావరణంలో విడుదల అయ్యిందని, కావాలని నేను మాట్లాడినట్టు నా గొంతుని AI ద్వారా వైసీపీ వాళ్ళు మార్ఫింగ్ చేసారని, కానీ అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నాయి కాబట్టి క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఎమ్మెల్యే వీడియో ని విడుదల చేసాడు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది సరిపోదని, బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల్లో క్షమాపణ చెప్పక పోతే మా కార్యాచరణ " DJ " స్టార్ట్ అవుతుంది 100 VEHICLES లో ఆయన మాటలే అనంతపురం అంతా వినిపిస్తాం.
– #JrNTR అభిమాని pic.twitter.com/OlLdkXeoan
— IndiaGlitz Telugu™ (@igtelugu) August 20, 2025
ఎమ్మెల్యే నిజంగా ఆ మాటలు అన్నాడా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించామని, అది ఎమ్మెల్యే ఒరిజినల్ వాయిస్ అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నువ్వు నిజంగా ఎన్టీఆర్ ని తిట్టలేదు అనుకుందాం, అభిమానులు ఫేక్ ఆడియో విని మోసపోయారు అనుకుందాం, అలాంటప్పుడు నువ్వు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నావు?, అధికార అహంకారం చూపిస్తున్నావు కదా అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే నేడు కాసేపటి క్రితమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సోషల్ మీడియా లో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు.
ఇంతకీ ఈ ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే ‘2 రోజుల్లోపు ఎమ్మెల్యే మాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే అనంతపురం మొత్తం, ప్రతీ వీధిలో డీజేలు పెట్టి ఎమ్మెల్యే ఎన్టీఆర్ ని తిట్టిన తిట్లను జనాలకు వినిపిస్తాము’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిని విన్న సోషల్ మీడియా ఎన్టీఆర్ ఫ్యాన్స్, అసలు ఇదేమి తింగరి ఆలోచన, ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి అమ్మని తిట్టడం సోషల్ మీడియా లో ఉండే వాళ్ళే వినలేకపోయారు, అలాంటి మాటలను ఊరంతా వినిపించి ఎన్టీఆర్ పరువుని మరింత దిగజారుస్తారా?, అసలు ఎన్టీఆర్ కి ఈ విషయం తెలిస్తే ఇంటికి పిలిచి మరి కొడుతాడు అంటూ సోషల్ మీడియా లో ఉండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇతర హీరోల అభిమానుల నుండి కూడా ఇదే రియాక్షన్ వచ్చింది. ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.