SSMB29 : ఇండియాలో ఏ దర్శకుడికి లేని గొప్ప గుర్తింపు రాజమౌళి కి మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాలతో 12 సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన తన తదుపరి మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి తొందర్లోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అతనికి సంబంధించిన ఏదైనా గ్లింప్స్ ని గాని, టీజర్ ని గాని రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నా మహేష్ బాబు అభిమానులకు కొంతవరకు నిరాశే ఎదురైంది.
కేవలం మహేష్ బాబు ఫేస్ రివ్యూ చేయకుండా ఆయన వేసుకున్న లాకెట్ ను హైలెట్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు. ఇక దాంతో సంతృప్తి చెందని మహేష్ బాబు అభిమానులు ఇంకా వాళ్లకు ఏవైనా అప్డేట్స్ కావాలని కోరుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం నవంబర్ నుంచి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలియజేశాడు. ఇక దానికి సంబంధించినట్టుగానే సినిమా యూనిట్ కూడా పనిచేస్తుందట…
మహేష్ బాబు అభిమానుల యొక్క ఆత్రుతను అర్థం చేసుకున్న ప్రియాంక చోప్రా ఈ సినిమా నుంచి కొన్ని లీకులు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇన్ స్టా లో అనిమల్స్ పిక్స్ ని షేర్ చేస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి రాజమౌళి మాత్రం అలాంటివి ఏమీ చేయకండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది…మరి ఈ సినిమాతో మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కూడా పాన్ వరల్డ్ లో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నందు వలన ఈమెకు కూడా ఈ సినిమా భారీ హైప్ ను తీసుకురాబోతుంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలోనే రాజమౌళి ఉన్నాడట. అందుకే నవంబర్ నుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పాటు పేక్షకులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెబుతున్నాడు…