Homeఎంటర్టైన్మెంట్NTR Fans Anger: కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేశం.. తిరుపతిలో పోలీస్ కంప్లైంట్ నమోదు..

NTR Fans Anger: కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేశం.. తిరుపతిలో పోలీస్ కంప్లైంట్ నమోదు..

NTR Fans Anger: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చర్చలకు కారణం ‘RAW NTR’ అనే సంస్థ ‘ఊరువాడా’ అనే కార్యక్రమం ద్వారా నిరుపేదలకు 100 కోట్ల రూపాయల సేవాకార్యక్రమాలు చేయబోతుండడమే. ఈ నెల 18 న తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారని , దీనిపై ఆయన మీడియా తో మాట్లాడబోతున్నారని, ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై ఎన్టీఆర్ అధికారిక ఆఫీస్ నుండి క్లారిటీ వచ్చింది. తాము ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం లేదని , 100 కోట్ల తో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు అంటూ వస్తున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

‘RAW NTR’ అనే సంస్థ తో ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని , దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఖండించాలని ఎన్టీఆర్ ఆఫీస్ నుండి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. అయితే దీనిపై ‘RAW NTR’ సంస్థ అధినేత స్పందిస్తూ , దీనికి ఎవరు అడ్డొచ్చిన ఆపే ప్రసక్తే లేదని , 18 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి , ప్రిపేర్ చేసిన ప్రోగ్రాం ఇది , వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు , ఈ నెల 18 న తాజ్ బంజారా హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నాం , అక్కడే మొత్తం మాట్లాడుతాము అంటూ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ బిజీ గా ఉన్నారని , రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన చేసినప్పటికీ కూడా , కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ పేరు ని దుర్వినియోగం చేస్తూ, ఇలాంటివి చేయడం వల్ల , తమ మనోభావాలు తీవ్ర స్థాయిలో దెబ్బ తింటున్నాయని, ప్రజల్లో వీళ్ళు గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, ఇకపై ఇలాంటి ప్రచారాలు చేస్తే సహించేది లేదంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ హెచ్చరించారు. దీనికంటే ముందు ఆయన అభిమానులతో కలిసి తిరుపతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి SI కి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా , ‘RAW NTR’ ఎందుకు ఎన్టీఆర్ పేరుని ఉపయోగించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయబోతుంది?, అసలు వాళ్ళ ధైర్యం ఏంటి ? అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular