NTR And Allu Arjun: ఎన్టీఆర్ తప్పించుకున్నాడు..అల్లు అర్జున్ దొరికేసాడు..ఇద్దరి కెరీర్స్ ని మలుపు తిప్పిన అట్టర్ ఫ్లాప్ సినిమా!

దర్శకుడిగా ఈ చిత్రం ఆయనకి మొదటి సినిమా, అంతకు ముందు రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసాడు. ఈయన లాగానే రచయితా గా పని చేసి దర్శకులుగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి వారు బాగా సక్సెస్ అవ్వడంతో, ఈయన కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతాడని అందరూ ఊహించారు.

Written By: Vicky, Updated On : October 24, 2024 5:00 pm

NTR And Allu Arjun

Follow us on

NTR And Allu Arjun: అల్లు అర్జున్ కెరీర్ లో మాయని మచ్చలు లాగా మిగిలిపోయిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ అనే చిత్రం కూడా ఉంటుంది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా అయితే ఉండాలో, అలా ఉండేందుకు ఎంతో హోమ్ వర్క్ చేసాడు. అప్పట్లో ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి కనీసం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ ని ఈ సినిమా తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టేసింది. మళ్ళీ ఇంకో సినిమా మొదలు పెట్టడానికి ఆయన చాలా సమయం తీసుకున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయితా వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు.

దర్శకుడిగా ఈ చిత్రం ఆయనకి మొదటి సినిమా, అంతకు ముందు రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసాడు. ఈయన లాగానే రచయితా గా పని చేసి దర్శకులుగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి వారు బాగా సక్సెస్ అవ్వడంతో, ఈయన కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతాడని అందరూ ఊహించారు కానీ ఇతనికి అసలు డైరెక్షన్ స్కిల్స్ ఏమాత్రం లేవు అని ఈ సినిమా చూసిన తర్వాతే అర్థమైంది. కథ చాలా బాగుంటుంది, ఆ కథకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, టేకింగ్ ఉండుంటే, అల్లు అర్జున్ కెరీర్ లో మైల్ స్టోన్ గా మిగిలిపోయేది ఈ చిత్రం. కానీ అలా జరగలేదు, పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది. వాస్తవానికి వక్కంతం వంశీ జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. ఆయన హీరో గా నటించిన ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ వంటి చిత్రాలకు కథని అందించింది వక్కంతం వంశీనే. వీటిల్లో టెంపర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అయితే ‘నా పేరు సూర్య’ చిత్రం కథ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడట వక్కంతం వంశీ. కథ చాలా బాగా నచ్చింది, చేస్తానని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి అయ్యాకనే చేస్తాను అని అన్నాడట. దీంతో వంశీ అన్ని రోజులు ఎదురు చూడలేక, అల్లు అర్జున్ కి వెళ్లి ఈ కథని వినిపించాడట. ఆయనకి తెగ నచ్చేసింది, వెంటనే షూటింగ్ ప్రారంభిద్దాం అని డేట్స్ కూడా ఇచ్చేసాడు. ఆ తర్వాత ఆ చిత్రం విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం, అల్లు అర్జున్ గ్యాప్ తీసుకొని ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంతో మన ముందుకు రావడం. ఆ కనీవినీ ఎరుగని రేంజ్ లో హిట్ అవ్వడంతో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లడం వంటివి చకచకా జరిగిపోయాయి.