spot_img
Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Movie Updates: ఎన్టీఆర్ డ్రాగన్ లో విషయం ఉంది కానీ అదొక్కటే మైనస్...

NTR Dragon Movie Updates: ఎన్టీఆర్ డ్రాగన్ లో విషయం ఉంది కానీ అదొక్కటే మైనస్ అవ్వనుందా..?

NTR Dragon Movie Updates: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అతనికి భారీ దెబ్బ తగిలింది నిన్ను చూడాలని సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ఒకసారిగా డీలా పడిపోయాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ‘ఆది’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు… వెంటనే సింహాద్రి సినిమాతో మరో మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు చాలా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సక్సెస్ లను సాధించిన కూడా ఇప్పటివరకు అతనికి ఒక ఇండస్ట్రీ హిట్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా సాధించలేకపోయాడు అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న… ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిన అవసరమైతే ఉంది.

ఎందుకంటే తన తోటి హీరోలు అందరు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో ఆయన ఆ ఫీట్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వదిలారు. గ్లింప్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఎన్టీఆర్ అందులో కొంత వరకు మైనస్ అయ్యాడంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కటౌట్ ఆ ఎంటైర్ సినిమా వరల్డ్ లో ఇమడలేకపోయిందనేది వాస్తవం.

ఇక అతని ప్లేసులో ప్రభాస్ గాని, యశ్ గాని ఉంది ఉంటే దానికి ఇంకాస్త ఇంపాక్ట్ వచ్చి ఉండేది. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ప్లస్ అయ్యాడా మైన అయ్యాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version