https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ కోటి రూపాయిల విరాళం..టాలీవుడ్ నుండి స్పందించిన ఏకైక హీరో!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపున తన వంతు సహాయం గా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో 50 లక్షల రూపాయిలు విరాళంగా అందించారు. ఇండస్ట్రీ నుండి మొట్టమొదట ఇలాంటి గొప్ప పనికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ మాత్రమే.

Written By:
  • Vicky
  • , Updated On : September 3, 2024 / 03:29 PM IST

    NTR

    Follow us on

    NTR: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనాలను ఎంత ఇబ్బందులకు గురి చేశాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మనం నడిచి వెళ్లే రోడ్లలో బోట్లు తిరుగుతుంటే చూడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, తెలంగాణ జిల్లాలు అయితే నీటిలో మునిగిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పడు వరద పరిస్థితిని అధ్యయనం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపున తన వంతు సహాయం గా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో 50 లక్షల రూపాయిలు విరాళంగా అందించారు. ఇండస్ట్రీ నుండి మొట్టమొదట ఇలాంటి గొప్ప పనికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ మాత్రమే. ఆయన్ని చూసి ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా తనవంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాల నిధులకు డొనేషన్ అందించాడు.

    ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జరుగుతున్న వరద బీభత్సం నా మనసుని ఎంతో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి ఆంధ్ర ప్రదేశ్ కోలుకోవాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నా తరుపున రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ ఖజానాకు చెరో 50 లక్షల రూపాయిలు విరాళం అందిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఈ పని చేయడంతో ఇక మిగిలిన స్టార్ హీరోలలో కూడా కదలిక వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇంత సత్వరంగా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు విరాళాలు అందించడం గతంలో మనం చాలా తక్కువసార్లు చూసాము. కానీ ఇప్పుడు మాత్రం వెంటనే స్పందించి ఈ స్థాయిలో విరాళం అందించాడంటే, ఆయన త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు నిజమేనా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ తో జనాల్లోకి రావడమో, లేకపోతే బీజేపీ పార్టీ అధ్యక్ష్య పదవిని చేపట్టడమో, రెండిట్లో ఎదో ఒకటి జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఆయన అభిమాన సంఘాలు కూడా గత ఏడాది నుండి సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.

    ఇవన్నీ ఆయన రాజకీయ అరంగేట్రం కి సూచనలే అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఈ నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభమయ్యాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి లక్ష 50 వేల డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే ఇలాంటి గ్రాస్ వచ్చిందంటే, కేవలం ప్రీమియర్స్ నుండి దేవర చిత్రం రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.