Devara: ‘దేవర’ కటౌట్ ని తగలబెట్టిన ఎన్టీఆర్ అభిమానులు..చితకబాదిన పోలీసులు..థియేటర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లో సుదర్శన్ థియేటర్ పెను ప్రమాదం లో చిక్కుకుంది. అభిమానులు ఉత్సాహంగా క్రాకర్స్ ని కాలుస్తున్న సమయం లో కొన్ని షాట్స్ కటౌట్ మీదకు దూసుకొని పోయాయి. దీంతో కటౌట్ తగలబడి పోయింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By: Vicky, Updated On : September 27, 2024 2:19 pm

Devara(5)

Follow us on

Devara: ఆరేళ్ళ తర్వాత ఒక మాస్ హీరో నుండి సినిమా వస్తుందంటే థియేటర్స్ తట్టుకోవడం కాస్త కష్టమే. ఈరోజు ‘దేవర’ విషయం లో అదే జరిగింది. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో చిత్రం ఇదే. అర్థ రాత్రి నుండే ఎక్కడ చూసిన థియేటర్స్ మొత్తం అభిమానుల కోలాహలం తో కిక్కిరిసిపోయాయి. ఎన్టీఆర్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తం ఇలాగే ఉంటుంది. డైరెక్టర్ ఎవరైనా కూడా మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు అదురుతాయి. ‘దేవర’ విషయం లో కూడా అదే జరిగింది. ఈ సినిమాకి ముందు ఆయన తీసిన ‘ఆచార్య’ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఈ చిత్రం ఓపెనింగ్స్ మీద ఇసుమంత కూడా పడలేదంటే దానికి కారణం ఎన్టీఆర్ క్రేజ్. ఇక అభిమానుల తాకిడి ని కట్టింది చేయడం పోలీసుల వల్ల కూడా అవ్వలేదు.

కొన్ని థియేటర్స్ లో సీట్లు విరిగాయి, స్క్రీన్స్ చిరిగాయి. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లో సుదర్శన్ థియేటర్ పెను ప్రమాదం లో చిక్కుకుంది. అభిమానులు ఉత్సాహంగా క్రాకర్స్ ని కాలుస్తున్న సమయం లో కొన్ని షాట్స్ కటౌట్ మీదకు దూసుకొని పోయాయి. దీంతో కటౌట్ తగలబడి పోయింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. మరికొందరు చెప్పే మాట ఏంటంటే ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది అసూయతో ఈ పని చేసారని, వాళ్ళని ఎవరో పట్టుకొని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమీపం లోనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే థియేటర్ వద్దకు వచ్చి మంటలు ఆర్పడం తో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే థియేటర్ మొత్తం తగలబడి పోయేది, వందలాది మంది ప్రాణాలు పోయేవి అని అంటున్నారు. ఇక సీడెడ్ ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కొన్ని చోట్ల పోలీసులు అభిమానులను అదుపు చేయడం కోసం లాఠీ చార్జి చాలా తీవ్ర స్థాయిలో చేయాల్సి వచ్చింది. ఒక్క థియేటర్ లో అభిమానులు టికెట్స్ లేకుండా చొరబడే ప్రయత్నం చేసారు. ఇలా హైదరాబాద్ లో కూడా పలు థియేటర్స్ లో చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మార్నింగ్ షోస్ కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు కలుపుకొని 92 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యిందట. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు. మార్నింగ్ షోస్ నుండే ఈ రేంజ్ ఉందంటే, ఇక సాయంత్రం షోస్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు.