https://oktelugu.com/

Namrata Shirodkar: మహేష్ కాదు నమ్రత ఫస్ట్ లవర్ అతడే, 9 ఏళ్లు ప్రేమాయణం… పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్!

సూపర్ స్టార్ మహేష్ బాబును నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ కంటే ముందు ఓ వ్యక్తిని నమ్రత తొమ్మిదేళ్లు ఘాడంగా ప్రేమించిందట. అతనితో బ్రేకప్ అయ్యాక ఆమె జీవితంలో శూన్యం ఏర్పడిందట. గతంలో నమ్రత తన ప్రేమ కథను బయటపెట్టింది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 27, 2024 2:24 pm
    Namrata Shirodkar(1)

    Namrata Shirodkar(1)

    Follow us on

    Namrata Shirodkar: ముంబై భామ నమ్రత శిరోద్కర్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. నమ్రత సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. నమ్రత తల్లి మీనాక్షి శిరోద్కర్ నటి. కాగా నమ్రత 1993లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకుంది. మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ దేశానికి నమ్రత ప్రాతినిధ్యం వహించింది. అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

    తెలుగులో నమ్రత రెండు చిత్రాలు చేసింది. అంజి, వంశీ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. అంజి డిలే కావడంతో వంశీ ఫస్ట్ విడుదలైంది. ఇక వంశీ మూవీ సెట్స్ లో మహేష్ బాబు-నమ్రత ప్రేమలో పడ్డారు. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. అయితే కొన్నాళ్లు ప్రేమికులుగా జర్నీ చేసి అవగాహన, నమ్మకం కుదిరాకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

    దాదాపు ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న మహేష్ బాబు-నమ్రత 2005లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. మహేష్ పెళ్లి గురించి మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. అప్పట్లో మహేష్ వివాహం సంచలనం రేపింది. పెళ్లి తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. గృహిణిగా మారిపోయింది. మహేష్ బాబు-నమ్రతలకు సితార, గౌతమ్ సంతానంగా ఉన్నారు.

    అయితే మహేష్ కంటే ముందు నమ్రత ఓ వ్యక్తిని ఘాడంగా ప్రేమించిందట. ఏకంగా 9 ఏళ్ళు వారి లవ్ స్టోరీ నడిచిందట. ఈ విషయాన్ని గతంలో నమ్రత వెల్లడించారు. నమ్రత ప్రేమికుడి పేరు దీపక్ శెట్టి అట. దీపక్ ని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ అందుకు ఇంకా సమయం ఉందని, నమ్రత అన్నారు. దీపక్ శెట్టి ఓ రెస్టారెంట్ ఓనర్ అట. దీపక్ ప్రమాదవశాత్తు మరణించినట్లు సమాచారం.

    దీపక్ మరణించక ముందే నమ్రతతో బ్రేకప్ అయ్యిందట. నేను మిస్ ఇండియా కాక ముందే ప్రేమలో పడ్డాను. అయితే బ్రేకప్ తర్వాత జీవితం శూన్యం అయ్యింది. అన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని నేను కోరుకున్నాను. మేము విడిపోయినా… ఇద్దరం బాగుండాలని కోరుకున్నామని, నమ్రత అన్నారు.

    నమ్రత ఇంకా మాట్లాడుతూ.. ఐశ్యర్య రాయ్, నేను ఒకే సమయంలో కెరీర్ స్టార్ట్ చేశాము. ఆమె ఒకే ట్రాక్ లో ముందుకు వెళ్ళింది. నేను మాత్రం ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటూ మరొక కోణం తీసుకున్నాను, అన్నారు. నమ్రత ప్రస్తుతం బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. మహేష్ బాబుకు సలహాదారుగా వ్యవహరిస్తోంది.