https://oktelugu.com/

Alia Bhatt Wedding: ఆలియా పెళ్లికి ఆ గిఫ్ట్స్ ఇస్తున్న ‘ఎన్టీఆర్ – చరణ్’ !

Alia Bhatt Wedding: పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ ఆమె, అతను బాలీవుడ్ లోనే మోస్ట్ ఫేవరేట్ హీరో… అసలు ఈ స్థాయి హీరో – హీరోయిన్ పెళ్లి అంటే ఎలా ఉండాలి ? ముఖ్యంగా ఆర్భాటాలు, హడావుడి ఏ స్థాయిలో ఉండాలి ? కానీ, చివరకు అలియా – రణబీర్ ల పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగుతుంది. అయితే.. ఇప్పుడు హాట్ టాపిక్ ఈ పెళ్లికి ఎవరెవరు వెళ్తున్నారు ?, ఆలియా ఎవర్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2022 / 03:38 PM IST
    Follow us on

    Alia Bhatt Wedding: పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ ఆమె, అతను బాలీవుడ్ లోనే మోస్ట్ ఫేవరేట్ హీరో… అసలు ఈ స్థాయి హీరో – హీరోయిన్ పెళ్లి అంటే ఎలా ఉండాలి ? ముఖ్యంగా ఆర్భాటాలు, హడావుడి ఏ స్థాయిలో ఉండాలి ? కానీ, చివరకు అలియా – రణబీర్ ల పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగుతుంది.

    Alia Bhatt, ntr, charan

    అయితే.. ఇప్పుడు హాట్ టాపిక్ ఈ పెళ్లికి ఎవరెవరు వెళ్తున్నారు ?, ఆలియా ఎవర్ని పిలిచింది ? ఇప్పుడున్న సమాచారం ప్రకారం షారుక్ ఖాన్, సంజయ్ లీల భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, దీపిక, రణ్వీర్ సింగ్ వంటి సినీ ప్రముఖులకు ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ అందాయి. కాకపోతే.. ఈ పెళ్లికి కేవలం 28 మంది మాత్రమే హాజరు కాబోతున్నారు.

    Also Read: Mega Hero: అప్పుడే సింగిల్ డిజిట్ కి పడిపోయిన మెగా హీరో !

    ఈ విషయాన్ని అలియాభట్ సోదరుడు రాహుల్ భట్ స్వయంగా తెలియజేశాడు. పెళ్లికి ఎక్కువ మందిని పిలవకపోయినా.. రిసెప్షన్ కి మాత్రం అందర్నీ పిలుస్తున్నారు. ముంబైలో జరగనున్న ఈ రిసెప్షన్ కి ఆర్ఆర్ఆర్ టీమ్ కి కూడా ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ – చరణ్ – రాజమౌళి కూడా ఈ రిసెప్షన్ కి వెళ్తున్నారు.

    ఈ రిసెప్షన్ లో ‘ఎన్టీఆర్ – చరణ్’ ఆలియా కోసం ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లోని ఆమె స్పెషల్ మూమెంట్స్ ను కలిపి గోల్డ్ ఫ్రేమ్స్ కట్టి గిఫ్ట్స్ గా ఇవ్వబోతున్నారు. అసలు ఆలియా ఇంత సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం..? అలియా భట్ తాతయ్య ఆరోగ్య పరిస్థితి విషమించింది. అలియా పెళ్లిని చూడాలన్న ఆయన కోరికను మన్నించి హడావిడిగా ఈ నెలలోనే పెళ్లి చేసుకుంటుంది ఆలియా.

    Alia Bhatt Wedding

    ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ మరియు అలియా భట్ వివాహం చేసుకోబోతున్నారని రాబిన్ భట్ ధృవీకరించారు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మొత్తానికి ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రణబీర్ తో అలియా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.

    వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు, కానీ.. వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఈ లవ్‌బర్డ్స్ అధికారికంగా ఒక్కటి కాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ టు బ్యూటిఫుల్ కపుల్.

    Also Read:RRR 18 Days Collections: ‘ఆర్ఆర్ఆర్’కి ఊపు తగ్గింది.. వాటికి పెరిగింది

    Tags