https://oktelugu.com/

Samantha Comments On Pushpa Song: నేను చేసినవన్నీ మర్చిపోయారు – సమంత

Samantha Comments On Pushpa Song: సమంత ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలే. వ్యక్తిగత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి.. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే, ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 12, 2022 / 03:37 PM IST
    Follow us on

    Samantha Comments On Pushpa Song: సమంత ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలే. వ్యక్తిగత ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి.. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయితే, ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయింది.

    Samantha

    జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి, ఊ అంటావా మావా పాటలో చాలా బాగా చేశానని చెప్తున్నారు. ఇది నిజంగా సంతోషకరం’ అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన దగ్గర నుంచి సామ్ కు చాన్స్ లు పెరిగాయి. పైగా బాలీవుడ్, హాలీవుడ్‏ లోనూ పాగా వేసేందుకు సామ్ బాగా ఉత్సాహంగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.

    Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

    ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అలాగే సమంత మరో వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుందట. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్ ‏లో తెగ కష్టపడిపోతుందని టాక్ నడుస్తోంది. సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీకి ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుంది.

    Samantha

    నిజానికి గతంలో సమంతకు కొన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు సమంత హిందీ చిత్రాల పై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాలే నా ప్రధాన టార్గెట్ అంటుంది. మొత్తానికి సైడ్ పాత్రలు వచ్చినా సమంత హిందీ సినిమాలను వదులుకునేలా లేదు. ఎలాగూ బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రస్తుతం దక్షిణాది తారల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    Also Read: రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?

    Tags