NTR : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది అనేంతలా తన గుర్తింపు కాపాడుకుంటూ ఆయన ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక సక్సెస్ అయితే సాధిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం అలాంటి సక్సెస్ లను సాధించలేకపోతుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Sannaf Vaijayanthi) అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ గా రెడీ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం… ఇక ఎన్టీఆర్ (NTR) ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి విజయశాంతి (Vijaya Shanthi) గారు చాలా బాగా ప్లస్ అవ్వబోతున్నారంటూ చెప్పాడు. అలాగే ఒకప్పుడు విజయశాంతి గారు చేసిన కర్తవ్యం(Karthavyam), ఒసేయ్ రాములమ్మ (Osey Ramulamna) లాంటి సినిమాతో ఆమె చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ విజయ శాంతి, కళ్యాణ్ రామ్ అన్న మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా లాస్ట్ 20 నిమిషాలు అందరి చేత కన్నీళ్లు పెట్టించేంత ఎమోషనల్ గా అయితే ఈ సినిమా సాగుతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చేశాయి.
Also Read : ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి ఫెయిల్ అయ్యాడు..ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడు..?
ఇక దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సైతం ఈ సినిమా మీద భారీ ఫోకస్ పెట్టినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు అంటూ అతన్ని గురించి గొప్పగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన స్పీచ్ అయితే ఇచ్చాడు.
ఇక దాంతో పాటుగా ఈ సినిమాని తను ముందే చూసేసానని సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. ఇక ఈ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు అలాగే నందమూరి ఫ్యామిలీ అభిమానులందరు కూడా కాలర్ ఎగిరేయవచ్చు అంటూ కళ్యాణ్ రామ్ గారి కాలర్ ను సైతం ఎన్టీఆర్ ఎగరేశాడు. ఈ సినిమా మీద భారీ హైప్ ను పెంచాడు.
ఇక ప్రస్తుతం ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా కళ్యాణ్ రామ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?