NTR And Prashanth Neel: ‘వార్ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) , ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో మొదలైన చిత్రం చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా తగ్గాడు. భోజనప్రియుడు అయినటువంటి ఎన్టీఆర్, ప్రస్తుతం ఈ సినిమా కోసం కఠోరమైన డైటింగ్ లో ఉన్నాడు. దీన్ని బట్టీ ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. రెండు భారీ షెడ్యూల్స్ తర్వాత ప్రశాంత్ నీల్ కి బ్రేక్ తీసుకోవడం అలవాటు. గతం లో కేజీఎఫ్ సిరీస్ మరియు సలార్ చిత్రాలకు ఇదే విధంగా చేసాడు. ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా కొనసాగిస్తున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన స్క్రిప్ట్ ని మరింత బలంగా రాసుకుంటాడట. అయితే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్టు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
రీసెంట్ గా ఆ చిత్ర నిర్మాత దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రానికి మేమింకా ఎలాంటి టైటిల్ ని ఖరారు చెయ్యలేదు. మూడు, నాలుగు టైటిల్స్ ని అనుకుంటున్నాం. త్వరలోనే ఒక టైటిల్ ని ఖరారు చేస్తాము. ఆ టైటిల్ ని ఒక గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి, అభిమానుల సమక్ష్యం లో రివీల్ చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత రవి శంకర్. మరి అప్పటి వరకు ఈ సినిమా టైటిల్ పై సస్పెన్స్ వీడదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం లో నటించే మిగిలిన నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ఆ గ్రాండ్ ఈవెంట్ లోనే తెలియజేస్తారట.