Bigg Boss 9 Telugu: ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) పై సోషల్ మీడియా లోని నెటిజెన్స్ లో మంచి అభిప్రాయం అయితే లేదు. బంధాలు , అనుబంధాలతో ఒక చక్కటి టీవీ సీరియల్ లాగా ఈ సీజన్ మారిపోయింది, కంటెస్టెంట్స్ అందరూ గొంతు చించుకొని ఒకరిపై ఒకరు అరుచుకుంటారు, కానీ అరగంటలో మళ్లీ కలిసిపోతారు. గత వారం లో తనూజ, దివ్య మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఒకరినొకరు జుట్టు పీక్కొని కొట్టుకునే స్థాయికి వెళ్లారు. వీళ్ళ మధ్య జరిగిన గొడవ ని చూసి, గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన దివ్య ని సేవ్ చేయడం కోసం నో ఎలిమినేషన్ పెట్టింది బిగ్ బాస్ టీం. ఎందుకంటే ఈ వారం ఆమె తనూజ తో గొడవలు కొనసాగిస్తుంది అనే ఉద్దేశ్యం తో అలా చేశారు.
కానీ వీళ్లిద్దరు నామినేషన్స్ సమయం లో స్నేహితులు గా మారడం కాదు, అక్కాచెల్లెళ్లు లాగా కలిసిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇలా ఏ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య కూడా శత్రుత్వం లేదు. ఫలితంగా గొడవలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సీజన్ అంతగా ఎక్కలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సీజన్ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ కి కూడా రానటువంటి టీఆర్ఫీ రేటింగ్స్ ఈ సీజన్ కి వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఈ సీజన్ హిట్ అయ్యింది అనేది. గత వారం టీఆర్పీ రేటింగ్స్ బ్లాస్టింగ్ రేంజ్ లో వచ్చాయి. పని దినాల్లో అర్బన్ + రూరల్ కలిపి 6.51 రేటింగ్స్ రాగా, కేవలం అర్బన్ నుండి 8.77 రేటింగ్స్ వచ్చాయి. అదే విధంగా శనివారం ఎపిసోడ్ కి అర్బన్ + రూరల్ కలిపి 7.49 రేటింగ్స్ రాగా, కేవలం అర్బన్ నుండి 9.91 రేటింగ్స్ వచ్చాయి.
అదే విధంగా ఆదివారం ఎపిసోడ్ కి అర్బన్ + రూరల్ కలిపి 7.13 రేటింగ్స్ రాగా, కేవలం అర్బన్ లో 10.57 రేటింగ్స్ వచ్చింది. ఓవరాల్ గా గత వారం మొత్తాన్ని యావరేజ్ చేస్తే 9.75 వరకు టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యాయి అని BARCC సంస్థ ప్రకటించింది. సీజన్ 4 మరియు సీజన్ 7 తర్వాత ఆ రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ ఈ సీజన్ కి నమోదు అయ్యాయి అయ్యాయి అని అంటున్నారు. గత సీజన్ తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ రేటింగ్ ఈ సీజన్ కి నమోదు అవుతుందట. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సీజన్ అవ్వడానికి ప్రధాన కారణం, బంధాలు, అనుబంధాలు, వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్లే. ఈ క్రెడిట్ మొత్తం భరణి, తనూజ, దివ్య, ఇమ్మానుయేల్ లకు ఇవ్వొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం ఈ నలుగురి చుట్టూనే తిరిగింది.