Anchor Sivajyothi : తెలుగు యాంకర్ శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ లో ప్రసాదం గురించి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియా సంస్థలు ఆ వ్యాఖ్యలకు విపరీతమైన ప్రాధాన్యమివ్వడంతో ఒక్కసారిగా శివజ్యోతి వివాదంలో చిక్కుకుంది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు ఆమె పట్ల మండిపడ్డాయి. దీంతో శివ జ్యోతి వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆ వివాదం ఇంకా తగ్గలేదు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం గురించి శివ జ్యోతి చేసిన వ్యాఖ్యల పట్ల వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేయించారని.. భవిష్యత్ కాలంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తలను నిజమా? కాదా? అని ధ్రువీకరించకుండానే ప్రసారం చేశాయి. దీంతో శివ జ్యోతి పై విమర్శలు మరింత పెరిగాయి.
శివ జ్యోతి ఆధార్ కార్డు ను తిరుమల తిరుపతి దేవస్థానం బ్లాక్ చేసింది అనే వార్తలపై మొత్తానికి క్లారిటీ లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతవరకు శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. మరోవైపు శివ జ్యోతి విషయంలో ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. వాస్తవానికి శివజ్యోతి మాట్లాడిన కాస్ట్లీ బిచ్చగాళ్ళం వ్యాఖ్యల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అది అక్కడితోనే ఆగిపోయింది. అంతేతప్ప శివ జ్యోతి మీద ఎటువంటి చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోలేదని తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో రీల్స్ చేయడానికి అవకాశం లేదు. కానీ శివ జ్యోతి వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వాస్తవానికి సోషల్ మీడియాను నమ్ముకొని శివజ్యోతి పాపులర్ అయింది. ఆమెకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గతంలో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి భారీగా సంపాదించిందని వార్తలు వచ్చాయి. ఏ సోషల్ మీడియాని అయితే ఆధారంగా చేసుకుని ఈ స్థాయిలో ఎదిగిందో.. అదే సోషల్ మీడియా ప్రభావం వల్ల శివజ్యోతి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. పాములు పట్టేవాడు పాము కాటుకు గురై చనిపోయినట్టు.. సోషల్ మీడియా దెబ్బకు శివజ్యోతి బలైపోయింది.