NTR- Mokshagna: నందమూరి కుటుంబం అంతా ఓ చోట చేరింది. సుహాసిని కుమారుడి పెళ్లి ఇందుకు వేదికైంది. దీంతో కొన్ని అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, మోక్షజ్ఞ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి కుటుంబంలో విబేధాలు లేవని ఈ ఫోటో అందుకు నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది. 2009 నుండి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలతో దూరం మైంటైన్ చేస్తున్నారు. ఇందుకు కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన కొన్ని ఈ గొడవలు మరింత ఆజ్యం పోశాయి. తారకరత్న దశదిన కర్మలో ఎన్టీఆర్ పలకరించినా బాలకృష్ణ స్పందించకుండా వెళ్ళిపోయాడు. అలాగే హైదరాబాద్ వేదికగా బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు భారీగా నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ని తప్పుబట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది నందమూరి-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ కి కారణమైంది.
ఈ పరిణామాల మధ్య హరికృష్ణ కుమార్తె సుహాసిని కొడుకు హర్ష పెళ్లి వేడుకలో అందరూ కలిశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ బాలకృష్ణను పలకరించాడు. ఈ వీడియోని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఎన్ని ఉన్నా ఎప్పటికైనా ఒకటే. బాబాయ్-అబ్బాయ్ కలిసిపోయారని అంటున్నారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఫోటో దిగారు. నందమూరి బ్రదర్స్ అంటూ ఈ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు.
కాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధమని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య బాగా బరువు పెరిగి షేప్ అవుట్ గా కనిపించిన మోక్షజ్ఞ స్లిమ్ అయ్యాడు. ఇది హీరో కావడం కోసమే అనే ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ కెరీర్లో ఐకానిక్ మూవీగా ఉన్న ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. దీనిపై బాలకృష్ణ గతంలో ప్రకటన చేశారు. ఆదిత్య 999 స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా.. ఈ మూవీలో మోక్షజ్ఞ నటిస్తాడట. బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారట.
https://twitter.com/Chakrintr3/status/1693463348619407721/photo/3