NTR And Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని సైతం పెంచాడు. ఇక తన జనరేషన్ లో తను టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కృష్ణ, శోభన్ బాబు లాంటి నటులు సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు హీరోల మధ్య పోటీ అనేది తీవ్రతరం అయ్యేది. ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల రెండు సినిమాల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరు సినిమాలు పోటా పోటీగా వచ్చి మంచి విజయాలను సాధించేవి. ఆ తదనంతరం కృష్ణ,శోభన్ బాబు మధ్య కూడా తీవ్రమైన పోటీ అయితే ఉండేది. ఇక ఒకానొక సందర్భంలో 1977 జనవరి 14వ తేదీన ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దానవీరశూర కర్ణ’.. కృష్ణ హీరోగా వచ్చిన కురుక్షేత్రం రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మొత్తానికైతే ఈ రెండు సినిమాలను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రెండింటి మీద తీవ్రమైన బజ్ అయితే క్రియేట్ చేశారు.
Also Read: మొగలిరేకులు సీరియల్ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..!
సినిమా ఎక్కడ షూట్ జరుగుతోంది అంటూ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేసేవారు. దానవీరశూరకర్ణ సినిమా కు సంబంధించిన సెట్ ను భారీ ఎత్తున వేశారు. దీని ద్వారా అభిమానులు సైతం తమ అభిమాన హీరోల సినిమాలు భారీ ఎత్తున తెరకెక్కుతున్నాయి అంటూ ఆ విషయాలను తెలుసుకుని ఆనందపడుతూ ఉండేవారు. ముఖ్యంగా దానవీరశూరకర్ణ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో భారీ సెట్ వేసి చేస్తే, ‘కురుక్షేత్రం’ సినిమా రాజస్థాన్లో భారీగా తెరకెక్కించి కృష్ణ ఎలాగైనా సరే ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం అయితే చేశారు.
అయితే ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ముగ్గురు కలిసి నటించడం అనేది అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే ఒకేరోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఒకే రోజు రెండు పండుగలు వస్తే జనాల్లో ఎంతటి ఆనందమైతే ఉంటుందో ఆరోజు అదే ఆనందం ప్రేక్షకులు అందరికి కలిగింది.ఇక కురుక్షేత్రం సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తే దానవీరశూరకర్ణ లాంగ్ రన్ భారీ విజయాన్ని సాధించింది.
కురుక్షేత్రం సినిమా 50 రోజుల వరకు చాలా బాగా ఆడినప్పటికి 50 రోజుల తర్వాత నుంచి డల్ అయిపోయింది. దానవీరశూరకర్ణ సక్సెస్ ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకొని భారీ రికార్డులను క్రియేట్ చేసింది. అయితే కురుక్షేత్రం సినిమా వారం రోజుల్లో 22 లక్షల కలెక్షన్స్ ను రాబట్టి అప్పట్లో ఒక భారీ రికార్డు ను క్రియేట్ చేసింది… ఇక ఎన్టీఆర్, కృష్ణ ల మధ్య జరిగిన పోటా పోటీ పోరు లో ఎన్టీఆర్ విజయాన్ని సాధించారనే చెప్పాలి…