NTR And Allu Arjun: ఎన్టీయార్, అల్లు అర్జున్ లలో ఎవరు బెస్ట్..?

ప్రస్తుతం ఎన్టీఆర్ కి, అల్లు అర్జున్ కి మధ్య మంచి పోటీ ఉందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఇద్దరూ కూడా మంచి డాన్సర్లు కావడం అలాగే నటనలో ఇద్దరు అద్భుతాలు చేస్తారు.

Written By: Gopi, Updated On : January 25, 2024 10:03 am
Follow us on

NTR And Allu Arjun: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయిన సింగల్ టేక్ లో చెప్పేస్తాడు అనే పేరు అయితే తనకు ఉంది. ఒకసారి సీన్ పేపర్ చూసుకొని ఎక్కడ తడబడకుండా అసలు ఏమాత్రం మొహమాట పడకుండా డైలాగ్ ని ఇచ్చిన క్షణంలోనే నేర్చుకొని సింగల్ టేక్ లో అద్భుతంగా నటించి చూపించగలిగే సత్తా ఉన్న నటుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం…

ఇక మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలందరి కంటే ముందే తను మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయినప్పటికీ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల తన క్రేజ్ స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నా , సక్సెస్ లు రాకపోవడంతో కొద్ది వరకు ఆయన మార్కెట్ డల్ అయింది. ఇక ఇదే క్రమంలో మెగా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూడా మొదట్లో లవ్ స్టోరీస్ చేసినప్పటికీ సరైనోడు సినిమాతో మాస్ హీరోగా ఎలివేట్ అయ్యాడు. అప్పటినుంచి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో చూపించాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కి, అల్లు అర్జున్ కి మధ్య మంచి పోటీ ఉందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఇద్దరూ కూడా మంచి డాన్సర్లు కావడం అలాగే నటనలో ఇద్దరు అద్భుతాలు చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయాన్ని మనం అంత పర్టికూలర్ గా చెప్పలేం, కానీ సినిమాల కలెక్షన్ల పరంగా అల్లు అర్జున్ కొంతవరకు ముందు స్థానంలో ఉన్నాడని కొంతమంది అంటున్నారు.

కానీ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో కలెక్షన్ల పరంగా అల్లు అర్జున్ ని బీట్ చేశాడు అయినప్పటికీ అది మల్టీ స్టారర్ సినిమా కావడం వల్ల ఆ క్రెడిట్ ఇద్దరు హీరోలకి వస్తుందనేది కూడా వాస్తవమే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పడం కష్టం. కానీ ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు రిలీజ్ అయితే ఎవరు బెస్ట్ అనేది ఇంకా క్లారిటీగా చెప్పే అవకాశం అయితే ఉంటుంది…