టాలీవుడ్లోని స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి తారక రామరావు మనువడిగా.. హరికృష్ణ కుమారుడిగా ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ నటనపై మక్కువ చూపుతూ ఎంతో కష్టపడుతుంటాడు. బాలనటుడిగా.. హీరోగా రాణించి నందమూరి నట వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నాడు.
Also Read: కరోనాలోనూ మెగాస్టార్ పారితోషికంపైనే చర్చ..!
జూనియర్ ఎన్టీఆర్ వయస్సు 40ఏళ్లు కూడా పూర్తికాకుండానే సినీరంగంలో 20ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. దివంగత ఎన్టీఆర్ తన మనువడిలోని నటనను గుర్తించి ఆయన నటించిన ‘బ్రహ్మర్షి విశ్వమిత్ర’లో బాలనటుడిగా అవకాశం కల్పించాడు. ఇందులో భరతుడు క్యారెక్టర్లో నటించాడు. 8ఏళ్ల వయస్సులోనే ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యపాత్రలో ‘బాలరామాయణం’ తెరకెక్కింది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ తాతకు తగ్గ మనువడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 18ఏళ్ల వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ‘నిన్ను చూడాలని’ సినిమాలో నటించాడు. ఈ మూవీని నిర్మాత రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మించాడు.
Also Read: వెంకీ – వరుణ్ ‘ఎఫ్ 3’కి ముహూర్తం ఖరారు !
ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడింట్ నెంబర్ వన్’ మూవీతో భారీ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఆది’.. ‘సింహద్రి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకొని స్టార్ హీరోగా మారాడు. ఎన్టీఆర్ కెరీర్ కొన్నాళ్లపాటు సాఫీగా సాగినప్పటికీ కొద్దిరోజులు ఒడిదుడులకు గురయ్యాడు. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’తో ఎన్టీఆర్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ 20ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా కామన్ డిస్ ప్లే పిక్చర్(సీడీపీ)ని రూపొందించారు. ఎన్టీఆర్ 20ఏళ్ల కెరీర్ ను తలపించేలా ఉన్న ఈ సీడీపీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఎన్టీఆర్ సీడీపీ నెట్టింట్లో వైరల్ అవుతోంది.