https://oktelugu.com/

బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

మంచి అందం, అభినయం ఉన్నా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్‌ సాధించలేకపోయిన నటి పూనమ్‌ బజ్వా. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసిన ఈ ముంబై భామ అప్పట్లో తన అంద చందాలతో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు చేసిందామె. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, ఆపై మళయాల సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్‌కు దూరమైన ఆమె తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఎక్కువ కాలం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 06:49 PM IST
    Follow us on


    మంచి అందం, అభినయం ఉన్నా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్‌ సాధించలేకపోయిన నటి పూనమ్‌ బజ్వా. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసిన ఈ ముంబై భామ అప్పట్లో తన అంద చందాలతో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు చేసిందామె. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, ఆపై మళయాల సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్‌కు దూరమైన ఆమె తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. లాస్ట్‌ ఇయర్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేసింది. వయసు మీద పడడంతో ఈ మద్య కాలంలో ఏ భాషలోనూ ఆమెకు చాన్స్‌లు రావడం లేదు. దాంతో, ఎలాగైనా లైమ్‌ లైట్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్న పూనమ్‌ ఓ డేరింగ్‌‌ స్టెప్‌ వేస్తోంది.

    రియాలిటీ షోస్‌ ద్వారా మళ్లీ ప్రేక్షకులకు చేరువ కావాలని చూస్తున్న ఈ హాట్‌ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌4లో ఓ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ ఇప్పటికే బజ్వాను సంప్రదించడం, ఆమె సంతకం చేయడం కూడా జరిగిపోయాయని సమచారం. ‘బాస్‌’ సినిమాలో నాగార్జున సరసన సెకండ్‌ హీరోయిన్గా‌ నటించడం ఆమెకు కలిసొచ్చిందని టాక్‌ నడుస్తోంది. ఆమె వస్తే గత సీజన్లకంటే ఎక్కువ గ్లామర్, కలర్ తోడవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే, ఈ షో కోసం పూనమ్‌ భారీగానే డిమాండ్‌ చేసిందని సమాచారం. ప్రైజ్‌ మనీతో సంబంధం లేకుండా ఏకంగా 45 లక్షల రెమ్యునరేషన్‌ అందుకుంటోందని టాక్‌. అయితే ఇదే మొత్తం రెమ్యునరేషనా? లేదంటే మళ్లీ రోజుకు ఇంత అని ఎక్స్‌ట్రా అమౌంట్‌ కూడా ఇస్తారా? అన్నది మాత్రం సస్పెన్స్.

    కాగా, స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ ఆగస్టు సెకండ్‌ వీక్‌లో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కంటెస్టంట్స్‌ జాబితా పూర్తయిందని, కరోనా నేపథ్యంలో వారిని 14 రోజుల ప్రీ క్వారంటైన్‌ కోసం రెడీ చేస్తున్నారని సమాచారం. థర్డ్‌ సీజన్‌ మాదిరిగా నాలుగో సీజన్‌కు కూడా కింగ్‌ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.