‘నీ కన్ను నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో సాంగ్ పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే మొదట్లో కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి, వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసింది. నాని ‘టక్ జగదీష్’ సినిమా ఒప్పుకున్నా ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ సాయిపల్లవి. ఇప్పుడు ఇదే భయం పట్టుకుందట కృతి శెట్టికి.
Also Read: పెళ్లి అయినా వదట్లేదు.. వరుసగా అవకాశాలు !
సాయి పల్లవి నటన ముందు తానూ పూర్తిగా తేలిపోతే.. తనకు ఉప్పెనతో వచ్చిన క్రేజ్ పోయే అవకాశం ఉందని.. అందుకే ఈ లోపే మరో రెండు మూడు సినిమాలను ఫైనల్ చేసుకోవాలని ఆశ పడుతుంది ఈ యంగ్ బ్యూటీ. కానీ మొత్తానికే ఆమెకు ఆఫర్లు దూరమైపోయాయి. మొదట్లో పిలిచి అవకాశం ఇస్తామని చెప్పిన దిల్ రాజు సంస్థ, యువీ క్రియేషన్స్ కూడా అమ్మడును పక్కన పెట్టేశాయి. పక్కన పెట్టాకా గానీ ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడలేదు. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుందట కృతి శెట్టి.
Also Read: డ్రగ్స్ తో పట్టుబడ్డ హీరోయిన్… రంగంలోకి టాలీవుడ్ పెద్దలు!
అయినా ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదని సమాచారం. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. సాయి పల్లవి, రష్మిక మందన్నలాగే తానూ కూడా ఆ క్రేజ్ హీరోయిన్ నే అని భ్రమ పడి కెరీర్ మొదలుకాకుండానే కష్టాలు కొని తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అన్నీ ఈ బ్యూటీకి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు మాత్రమే వస్తున్నాయట. ఈ క్రమంలోనే నితిన్ కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ వచ్చింది. చివరకు సెకెండ్ హీరోయిన్ కే పరిమితం అవ్వాల్సి వస్తోందేమో.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్