https://oktelugu.com/

Venu Swamy: మహిళా కమీషన్ నుండి నోటీసులు..వేణు స్వామి అరెస్ట్ కాబోతున్నడా..?

కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పట్ల అనుచితంగా, ఆమె అనుమతి లేకుండా జాతకం చెప్పడమే కాకుండా, ఆమె మనస్సు నొచ్చుకునేలా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చెప్పారో ఈ నెల 22 వ తారీఖున కమీషన్ కి వచ్చి వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టపరమైన చర్యల కోసం ముందుకు పోతాము అంటూ ఉత్తర్వులు జారీ చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 07:03 PM IST

    Venu Swamy(2)

    Follow us on

    Venu Swamy: జ్యోతిష్యం పేరుతో సెలెబ్రిటీలపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే వేణు స్వామి, రీసెంట్ నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా వారి జాతకం చెప్తూ, మరో మూడేళ్ళలో వీళ్ళు ఒక స్త్రీ కారణంగా విడిపోతారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ఇంతకు ఇలాంటి కామెంట్స్ ఆయన ఎన్ని చేసినా కూడా సమస్యల్లో చిక్కుకోలేదు. కానీ ఈసారి మాత్రం వేణు స్వామి కి చాలా పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. నేడు ఆయనకి మహిళా కమీషన్ నుండి ఉత్తర్వులు వచ్చాయి.

    కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పట్ల అనుచితంగా, ఆమె అనుమతి లేకుండా జాతకం చెప్పడమే కాకుండా, ఆమె మనస్సు నొచ్చుకునేలా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చెప్పారో ఈ నెల 22 వ తారీఖున కమీషన్ కి వచ్చి వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టపరమైన చర్యల కోసం ముందుకు పోతాము అంటూ ఉత్తర్వులు జారీ చేసారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ రీసెంట్ గానే వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ పై మహిళా కమీషన్ కి ఫిర్యాదు చెయ్యగా, నేడు ఈ కార్యాచరణ జరిగింది. ఒకవేళ వేణు స్వామి కమీషన్ కి హాజరై వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలకు వాళ్ళు సిద్ధమైతే వేణు స్వామి అరెస్ట్ కాబోతున్నాడా? అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జాతకాలు వారి అనుమతి లేకుండా, పబ్లిసిటీ కోసం ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చెయ్యడం ముమ్మాటికీ చట్టరీత్యా నేరమే. ఇకపోతే కాసేపటి క్రితమే వేణు స్వామి ని సమర్థిస్తూ ఆయన సతీమణి వీణ శ్రీవాణి ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఈమెపై సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ కి ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ఈమె గొప్ప సంగీత కళాకారిణి.

    లైవ్ గా ఈమె చేసే సంగీత ప్రదర్శనలకు ప్రపంచవ్యాప్తంగ్తా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంతే కాదు ఈమె అనేక టాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. అమాయకంగా కనిపించే ఈమె ఇంత మాట్లాడగలదా అని నేడు ఆమె విడుదల చేసిన వీడియో బైట్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే వేణు స్వామి ఈ ఎన్నికలలో జగన్ ఓడిపోయిన వెంటనే ఇక సెలెబ్రెటీలకు జాతకాలు చెప్పను అంటూ, మళ్ళీ నాగ చైతన్య జాతకం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సెలెబ్రిటీల జోలికి రాను అంటుంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఆయన అసలు మారాడని, ఒక్కసారి ఆయన్ని అరెస్ట్ చేస్తే కానీ బుడ్డి రాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరి వేణు స్వామి అరెస్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.