https://oktelugu.com/

Shivam Dube: సతీమణి నిర్వాకం.. చిక్కుల్లో టీమిండియా క్రికెటర్ శివం దూబే.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం..

నజియా.. త్రిబుల్ తలాక్ బాధితురాలు ఇస్రత్ జహాన్ కు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. మతపరమైన ఆచారాలకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 13, 2024 / 07:19 PM IST

    Shivam Dube

    Follow us on

    Shivam Dube: టీమిండియా క్రికెటర్ శివం దూబే ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఇందుకు కారణం ఆయన భార్య అంజుమ్ ఖాన్.. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది.. అంజుమ్ ఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ లో బిజెపి నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ ను అరెస్ట్ చేయాలని పిలుపునిస్తూ ఒక కథనాన్ని పోస్ట్ చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చింది. అంజుమ్ ఖాన్ అలా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే..

    అదే ఆమె ఆగ్రహానికి కారణం.

    నజియా.. త్రిబుల్ తలాక్ బాధితురాలు ఇస్రత్ జహాన్ కు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. మతపరమైన ఆచారాలకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బిజెపి మైనారిటీ సెల్ లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల నజియా ముస్లిం సమాజంలో పేరుకుపోయిన చాందసవాదాన్ని ప్రశ్నించింది. ఇది అంజుమ్ ఖాన్ కు తప్పుగా అనిపించింది. ” ముస్లిం ప్రవక్త కు అ గౌరవం వాటిల్లుతోంది. మీకు కోపం రాకపోతే మనస్సాక్షి చనిపోయిందని అర్థం. మనస్సాక్షి మీలో సజీవంగా ఉంటే #arrest Nazia Elahi Khan ను సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాప్తి చేయండి. నాజియా పై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఆమె.. తన నోరు కు మరింత పదును పెట్టింది. చెత్తగా మాట్లాడుతోందని” వ్యాఖ్యానించింది.

    నెటిజన్లు ఏమంటున్నారంటే..

    శివం దూబే సతీమణి కావడంతో అంజుమ్ చేసిన పోస్ట్ పై స్పందించారు. ” నాజియా హింసకు ఎలా పిలుపునిచ్చారు? అందులో మీకు అలాంటి కోణం ఎలా కనబడుతోంది? మీరు ఆమె అరెస్టుకు ఎలా పిలుపునిస్తారు? ఒక సెలబ్రిటీ భార్య అయి ఉండి ఇలాంటి పోస్టులు చేయడం ఏంటి” అని ప్రశ్నించడంతో.. అంజుమ్ తాను చేసిన పోస్టును డిలీట్ చేసింది.. అయితే ఈ విషయం నాజియా దృష్టికి రావడంతో.. ఆమె కూడా స్పందించింది. అంజుమ్ ను సోషల్ మీడియాలో ఏకీపడేసింది. ” రాహుల్ గాంధీ జీ హిందువుల పట్ల ఇంత దేశానికి కారణం ఏమిటో మీరు చెప్పండి. మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిపై దాడి చేసేందుకు ఒక బృందాన్ని మీరు సిద్ధంగా ఉంచారు. నా దేశం ఇస్లామిక్ కాదు రాహుల్ గాంధీజీ. ఇది తెలంగాణలోని దళారీలకు చెప్పండి” అంటూ ఆమె ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు..”బంగ్లాదేశ్ లో రాహుల్ గాంధీ హిందువులపై హింసను ప్రేరేపిస్తున్నారు. అక్కడ విద్యార్థులను ఉద్యమాల వైపు ఎగ దోస్తున్నారని” ఆరోపించారు. నాజియా రాహుల్ గాంధీతో పాటు అంజుమ్ పై కూడా రెచ్చిపోవడంతో శివం దూబే తల పట్టుకున్నాడు. తన భార్య ద్వారా తలవంపులు ఎదురు కావడంతో సమాధానం చెప్పుకోలేని స్థితిలో కూరుకు పోయాడు. చాలామంది అంజుమ్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి…శివం దూబే కు ట్యాగ్ చేసి పోస్టు చేస్తుండడంతో.. అతడు సమాధానం చెప్పడానికి స్థితిలో కూరుకు పోయాడు.

    అలిగర్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి

    శివం దూబే సతీమణి అంజుమ్ ఉత్తర ప్రదేశ్ లోని అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. శివం దూబే ను వివాహం చేసుకోవడం కంటే ముందు ఆమె మోడలింగ్ చేసింది. అనేక హిందీ సీరియల్స్ లో నటించింది. హిందీ మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2021, జూలై 16న హిందూ, ముస్లిం ఆచారాల ప్రకారం శివం దూబే, అంజుమ్ వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు డేటింగ్ చేశారు. ఈ దంపతులకు 2022, ఫిబ్రవరిలో మొదటి సంతానంగా ఒక కుమారుడు జన్మించాడు.