https://oktelugu.com/

Tillu Square 2: టిల్లు స్క్వేర్ 2 లో ఈ రెండు తప్పులను గమనించారా?

సినిమా త్వరలో రాబోతుంది అంటూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటే ప్రేక్షకులు చాలా ఎదురుచూశారు. ఇక సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూ కూడా ఎంతగానో ఎదురుచూశారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 30, 2024 / 11:21 AM IST

    two mistakes in Tillu Square 2

    Follow us on

    Tillu Square 2: టిల్లు సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నల గడ్డ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి నిన్న రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఇందులో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి అనే విషయాలు ఓ సారి చూసేద్దాం.

    సినిమా త్వరలో రాబోతుంది అంటూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటే ప్రేక్షకులు చాలా ఎదురుచూశారు. ఇక సోషల్ మీడియాలో అప్డేట్స్ చూస్తూ కూడా ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఆలస్యం అవుతుంటే సినిమా కంటెంట్ మీద, షూటింగ్ మీద అనుమానాలు వ్యక్త పరిచారు ప్రేక్షకులు. ఏదైనా లోపం ఉండడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో ఓ రెండు విషయాల మీద కాస్త నెగటివ్ టాక్ వస్తోంది. అవేంటంటే..

    హీరోహీరోయిన్ ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి సినిమా చూడకుండా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఈ సీన్లు మోతాదుకు మించి ఎక్కువగా ఉండడమే మైనస్ అంటున్నారు కొందరు. కొన్ని చోట్ల ఈ సీన్లు అవసరం లేకున్నా కూడా పెట్టారని టాక్. సో వీటి విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. కానీ ఈ సినిమాలో పాజిటివ్ విషయాలు ఫుల్ గా ఉన్నాయి. అందుకే దూసుకొనిపోతుంది టిల్లు స్క్వేర్ సినిమా.

    మొదటి సినిమాకు సంబంధించి చాలా రిఫరెన్స్ లు సెకండ్ పార్ట్ లో వాడారు. సేమ్ టెంప్లేట్ మీద వచ్చింది ఈ సినిమా. కొన్ని సార్లు నవ్వు వచ్చినా ఎక్కువ సార్లు ఉన్నాయి కదా అనిపిస్తుంది. అందుకే ఈ రెండు విషయాల మీద చిత్ర బృందం కాస్త ముందుగానే జాగ్రత్త వహించి ఉంటే సూపర్ గా ఉండేది అంటున్నారు ప్రేక్షకులు. మొత్తానికి ఈ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకొనిపోతుంది. మరి హిట్ టాక్ లో పార్ట్ 1ను దాటేస్తుందో లేదో చూడాలి.