ఒక సినిమాను రీమేక్ చేస్తున్నారు అంటేనే.. ఆ సినిమా కథ విపరీతంగా నచ్చితేనే చేస్తారు. అందుకే, రీమేక్ కథలను అస్సలు మార్చరు. ఒరిజినల్ ఎలా ఉందో.. రీమేక్ సినిమా కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఉండాలి కూడా. అయినా, ఇష్టమొచ్చినట్లు మార్చుకుంటున్నప్పుడు.. ఇక రీమేక్ కథల కోసం కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం..? ఇది మన మేకర్స్ కు ఎందుకు అర్ధం కాదో మరి. కథల పై పట్టు ఉందనే పేరును సంపాదించుకున్న దిల్ రాజు కూడా ఇలా హిట్ కథలను మార్చుకుంటూ పోతే.. ఇక కథ గురించి ఏమి తెలియని నిర్మాతల పరిస్థితి ఏమిటో ?
Also Read: ‘మాళవిక’ను కష్టాల్లో పడేసిన మాస్టర్ !
ఇంతకీ ఇది దేని గురించి అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించే. నిజానికి అమితాబ్ పాత్రను పవన్ చేస్తాడని తెలిసినపుడు ఫాన్స్ షాక్ అయిన మాట వాస్తవం. పాసివ్ రోల్ లో పవర్ స్టార్ ని ఎలా ఉహించుకోవాలి అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ, అంతలో తమిళంలో అజిత్ కుమార్ ఇమేజ్‌కి అనుగుణంగా మార్పులు చేసి, ఆ సినిమా సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఈ సినిమా పవర్ స్టార్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా నమ్మారు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్-రానా.. పవన్ ఫ్యాన్స్ కు గొప్ప గుడ్ న్యూస్
అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది.. తమిళంలో ఒక ఫైట్ సీన్, రెండు, మూడు సన్నివేశాల మినహా కథలో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ వకీల్ సాబ్ లో మాత్రం కథలో కూడా మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా అమితాబ్, అజిత్ మాదిరిగా ఏదో ట్రాన్స్ లో వున్న వకీల్ లా కాకుండా, అసహనంతో ఊగిపోయే లాయర్ గా పవన్ ను సినిమాలో చూపించబోతున్నారు. దాంతో అనవసరపు స్పీచ్ లు ఎక్కువైయ్యాయి అట. అలాగే హీరోయిన్ ను యాడ్ చేయడం, ఆమెతో రెండు మూడు లవ్ సీన్స్ కూడా మిక్స్ చేయడం.. మొత్తానికి వకీల్ సాబ్ కిచిడీ సాబ్ అయ్యాడనే అనుమానం ఉంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్