https://oktelugu.com/

Samantha : ఆనంద్ దేవరకొండ కు.. రష్మికానే కాదు సమంత కూడా సపోర్ట్.

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గం గం గణేశా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చూడడానికి అద్భుతంగా ఉంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని స్టోరీలో సమంత పేర్కొన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 10, 2023 / 01:10 PM IST

    Not only Rashmika but also Samantha support Anand Deverakonda

    Follow us on

    Samantha : కొంతమంది ఈరోజు సినిమా అయ్యేంత వరకే హీరోయిన్ తో మాట్లాడుతుంటారు. మరి కొంతమంది హీరోలు సినిమాలయ్యాక కూడా వారితో మంచి స్నేహబంధం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రెండో రకానికి చెందిన హీరో విజయ్ దేవరకొండ.

    ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా మనకు పరిచయమైన మరో హీరో ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం వచ్చిన బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా సాధించారు. కాగా ఈ హీరో బేబీ సినిమా అప్పుడు…రష్మిక మందాన ఆ చిత్రానికి పబ్లిసిటీ పరంగా సహాయపడిన సంగతి తెలిసిందే.

    రష్మికా కు విజయ్ దేవరకొండకు మధ్యలో ప్రేమ ఉంది అని ఎన్నో రోజుల నుంచి వార్త ప్రచారంలో ఉంది. వీరిద్దరూ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కూడా నటించారు. ఇక ఆనంద్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక చాలానే కష్టపడింది. అంత పెద్ద హీరోయిన్ బేబీ సినిమాలో పాట రిలీజ్ కోసం రావడంతో.. ఆ చిత్రం కి మొదట్లోనే కొంచెం విజిబిలిటీ కూడా వచ్చింది.

    ఇక ఇప్పుడు రష్మికానే కాదు సమంత కూడా ఇదే దారి ఫాలో అయిపోయింది. ఈ మధ్యనే సమంత.. విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఒక మోస్టారు హిట్ సాధించింది. ఇక ఇప్పుడు సమంతా కూడా ఆనంద్ దేవరకొండ కి సపోర్ట్ గా నిలుస్తోంది

    బేబీ సినిమా తరువాత ఆనంద్ ప్రస్తుతం ‘గం గం గణేశా’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విడుదల చేశారు.
    కాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ‘గం గం గణేశా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన స్టార్ హీరోయిన్ సమంత. పోస్టర్ అద్భుతంగా ఉందని కామెంట్ కూడా పెట్టేసింది. ‘ప్రియమైన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా గం గం గణేశా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చూడడానికి అద్భుతంగా ఉంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని స్టోరీలో సమంత పేర్కొన్నారు.

    దీంతో అన్న హీరోలు తమ్ముడు సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.