Sri Reddy : ఆ తమిళ హీరో నా అన్న.. కానీ అక్రమ సంబంధం అంట కట్టారు.. : శ్రీ రెడ్డి.

నేనైతే ఒకటే క్లారిటీ ఇస్తున్నా.. ఉదయనిధి గారు నాకు అన్నతో సమానం’ అని తెలియజేసింది శ్రీరెడ్డి.

Written By: NARESH, Updated On : September 10, 2023 1:07 pm
Follow us on

Sri Reddy : సోషల్ మీడియాకు అలానే వార్తలకు సెన్సార్ ఉండదు. అందుకో ఏమో తెలియదు కానీ శ్రీ రెడ్డి ఈ రెండు పరికరాల ద్వారా తను ఏమి మాట్లాడాలన్నా.. ఏమి చూపియాలన్నా అది చేసేస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వారిని ఏదో ఒక రకంగా దూషిస్తూ.. లేదా పొగుడుతూ.. పబ్లిసిటీ తెచ్చుకునేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.

ఇక ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి తెలుగు మీడియా తో ఈ అమ్మడుకు బోర్ కొట్టేసిందో ఏమో కానీ.. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ మీడియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అసలు విషయానికి వస్తే మనకు ఓకే ఓకే.. సైకో సినిమాలతో మన తెలుగు వారికి కూడా పరిచయమైన తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్. ఈయన హీరో మాత్రమే కాదు అక్కడ గొప్ప పొలిటీషియన్ కూడా. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ పేరే మారుమోగిపోతుంది. సనాతన ధర్మం అంతమొందించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అంతేకాకుండా ఉదయనిధి తల తెగ్గోసి తీసుకొస్తే రూ.10 కోట్లు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించారు కొన్ని హిందూ సంఘాలు. మరోపక్క ఈయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు కూడా అదే తరహాలో ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని ఉదయనిధి మద్దతు తెలుపుతున్నాయి మరికొన్ని సంఘాలు.

ఇక ఇలాంటి పెద్ద వివాదంలోకి మన హాట్ బాంబ్ శ్రీరెడ్డిని లాగేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్. అసలు ఎందుకు అనగా 2019లో ఆమెకు ఉదయనిధి స్టాలిన్‌కి అక్రమ సంబంధాన్ని అంటకడుతూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే స్వయంగా శ్రీరెడ్డే.. ఆ విషయాలను చెప్పినట్టుగా పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరో విశాల్ ద్వారా.. శ్రీరెడ్డి.. ఉదయనిధి స్టాలిన్‌ని ఓ సినిమా ఈవెంట్‌లో కలిసిందని.. ఆ తరువాత గ్రీన్ పార్క్‌ హోటల్‌లో ఉదయనిధితో శ్రీరెడ్డి శారీరకంగా కలిసిందని.. ఈ విషయాన్ని స్వయంగా శ్రీరెడ్డి చెప్తున్నట్టుగా ఓ పోస్ట్ అప్పట్లో.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ రూమర్ వచ్చినప్పుడే శ్రీరెడ్డి దాని గురించి మాట్లాడుతూ.. నాకేం తెలియదు బాబోయ్.. అసలు ఆ పోస్ట్ నేను పెట్టలేదంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో ఈ ఇష్యూపై చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించిన శ్రీరెడ్డి.. ‘తాను ఎప్పుడూ ఉదయనిధిని కలవలేదని.. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని.. తన పేరుపై ఫేక్ పేజ్‌తో దుష్ప్రచారం చేస్తున్నారంటూ తనపై వచ్చిన రూమర్లను ఖండించింది.

కానీ ఇప్పుడు మళ్లీ ఉదయనిధి స్టాలిన్‌‌ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమయంలో.. గతంలో శ్రీరెడ్డి పేరుతో వచ్చిన ఫేక్ పోస్ట్‌ని మళ్లీ తెరపైకి తెచ్చారు. సేమ్.. అప్పట్లోలాగే.. శ్రీరెడ్డికి ఉదయనిధి మధ్య శారీరక సంబంధం ఉందని.. ఈ విషయాన్ని స్వయంగా తానే చెప్పిందంటూ మళ్లీ పుకార్లకు తెరలేపారు. దీంతో శ్రీరెడ్డి మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘ఈ మధ్య నేను పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యాను కాబట్టి.. ప్రత్యర్ధి వర్గం నన్ను తట్టుకోలేక.. నాపై తప్పుడు వదంతులు సృష్టిస్తున్నారు. నన్ను నేరుగా ఎదుర్కోవడం చేతకాక.. పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. ఏం పర్లేదు చేస్తే చేసుకోండి కానీ.. జనానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నాకు ఉదయనిధి స్టాలిన్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ని నేను అన్నా అని పిలుస్తాను. లేనిపోనివి సృష్టించి.. మీ వ్యూస్ కోసం ఎక్కువ తపించిపోకండి. నేను తమిళనాడులో ఉన్నాను కాబట్టి.. ఉదయనిధి స్టాలిన్ అన్నని.. నన్ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేస్తే.. చెన్నైలో స్టాలిన్ ఫ్యాన్స్ నాకు హాని తలపెడతారనే కుట్రతో ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు. నేనైతే ఒకటే క్లారిటీ ఇస్తున్నా.. ఉదయనిధి గారు నాకు అన్నతో సమానం’ అని తెలియజేసింది శ్రీరెడ్డి.