North Korea : కొరియన్ డ్రామాలు (K-షోలు) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. కొరియన్ డ్రామాలోని రొమాన్స్, యాక్షన్ లేదా థ్రిల్లర్‌ను ఇష్టపడే వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ప్రతిచోటా కొరియన్ డ్రామాలకు అభిమానులు పెరుగుతున్నారు. అయితే ఉత్తర కొరియాలో ఈ డ్రామాలు చూడటం నేరమని, కఠినంగా శిక్షించబడుతారు. ఉత్తర కొరియాలో కొరియన్ డ్రామా ఎందుకు నిషేధించబడింది. అక్కడ ఎవరైనా కొరియన్ నాటకాన్ని చూస్తే ఏమి జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉత్తర కొరియా అనగానే మనందరికీ అక్కడి విచిత్రమైన, కఠినమైన చట్టాల గురించి ఆలోచనలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ విచిత్రమైన చట్టాలను ప్రవేశపెట్టి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక్కడ నియంతృత్వం ఉంది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి చట్టానికి పౌరులు కట్టుబడి ఉండాలి. లేకుంటే కఠినంగా శిక్షిస్తారు. అక్కడ సినిమాలు చూడడం, మ్యూజిక్ వినడం, జీన్సులు వేసుకోవడం నిషేధం.. ఆ నియమాలు ఎవరైనా తప్పితే బహిరంగంగా మరణ శిక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ దేశంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీవీ ఛానెళ్లను మాత్రమే వీక్షించాలి. తప్పితే మరే ఇతర ఛానెళ్ల కూడా చూడడానికి అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం లేదు.
ఉత్తర కొరియాలో కొరియన్ డ్రామా చూడటం ఎందుకు నేరం?
నిజానికి దక్షిణ కొరియా జీవనశైలిని చూసి అక్కడి ప్రభుత్వం స్ఫూర్తి పొందడం ఉత్తర కొరియా ప్రభుత్వానికి ఇష్టం లేదు. వాస్తవానికి, దక్షిణ కొరియాలో ప్రదర్శించిన డ్రామాలలో చూపిన సామాజిక శైలులు ఉత్తర కొరియాను పోలి ఉండవు, కాబట్టి వాటిని అక్కడ నిషేధించారు. ఈ డ్రామాలు పాశ్చాత్య ఆలోచనలతో ప్రజలను ప్రభావితం చేయగలవని ఉత్తర కొరియా ప్రభుత్వం భయపడుతోంది. అది వారి కఠినమైన పాలనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అందుకే ఈ డ్రామాలపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.
కొరియన్ డ్రామా చూసినందుకు శిక్ష ఏమిటి?
ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా డ్రామాలను చూసే వ్యక్తులకు కఠినమైన నియమాలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా ఇలాంటి డ్రామాలు చూస్తూ దొరికితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో, దక్షిణ కొరియా నాటకాలు చూసినందుకు మరణశిక్ష కూడా విధించబడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా దక్షిణ కొరియా డ్రామాలు చూస్తూ దొరికిపోతే, అతనికే కాదు అతని కుటుంబానికి కూడా శిక్ష పడుతుంది. అలాంటి సందర్భాలలో, అతని కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లవచ్చు లేదా కష్టపడి ప్రభుత్వానికి బానిసలా పనిచేయవలసి వస్తుంది.