మా ఎన్నికల్లో నాన్ లోకల్ గోల

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఇటీవల మా కు జరిగే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో పోరు మొదలైంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేయడంతో అసలు విషయం తెరమీదకు వస్తోంది. ఆయన నాన్ లోకల్ అనే ముద్ర వేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. తనపై ఇక్కడి వాడు కాదనే అభాండం వేయడంపై ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం […]

Written By: Srinivas, Updated On : June 25, 2021 7:18 pm
Follow us on

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఇటీవల మా కు జరిగే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో పోరు మొదలైంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేయడంతో అసలు విషయం తెరమీదకు వస్తోంది. ఆయన నాన్ లోకల్ అనే ముద్ర వేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. తనపై ఇక్కడి వాడు కాదనే అభాండం వేయడంపై ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. దీని వెనుక కసరత్తు ఉంది. తెలుగు పరిశ్రమ నాకు గౌరవం ఇచ్చిందని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న విషయాలు చూసి ఊరుకోలేక పోటీకి సిద్ధమయ్యానన్నారు. మాటలు చెప్పడం కాదు చేతలు చేసి చూపించడమే బాధ్యతగా గుర్తిస్తున్నట్లు చెప్పారు.

ఏడాది క్రితం నుంచి జరిగే పరిణామాలు చేసి పోటీ చేయాలని భావించానన్నారు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నానన్నారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కొవిడ్ కారణంగా వాయిదా పడినట్లు చెప్పారు. నా ఉద్దేశంలో పని చేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. మా లో ఉన్న సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని వివరించారు.

సినిమా అనేది యూనివర్సల్ అని అన్నారు. పరభాషా అనే పదం సరికాదన్నారు. నాన్ లోకల్ అని విభజించడం సముచితం కాదన్నారు. ఇక్కడి హీరో విశాల్ తమిళనాడులో అధ్యక్షుడు కాలేదా అని ప్రశ్నించారు. అందుకే నాన్ లోకల్ పదం సరికాదన్నారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేసే ఉద్దేశంతో కొందరు ఉన్నట్లు చెప్పారు.