https://oktelugu.com/

వైరల్ : స్టార్ వారసురాలు నటనకు గుడ్ బై !

సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ పుల్‌ గా రాణించడం అంటే అది అంత సులువు కాదు. అయితే సినిమా నేపథ్యం ఉన్న వాళ్లకు ఎంట్రీ చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ ఆరంగ్రేటం అదిరినా, అది కొనసాగించలేక మధ్యలోనే కెరీర్‌ ను ముగించేసిని వాళ్లు లెక్కకు మించి ఉన్నారు. అందులో స్టార్ వారసులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో కేటగిరి ఉంది, సినిమాల్లోకి గ్రాండ్‌ […]

Written By:
  • admin
  • , Updated On : June 25, 2021 / 07:02 PM IST
    Follow us on

    సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ పుల్‌ గా రాణించడం అంటే అది అంత సులువు కాదు. అయితే సినిమా నేపథ్యం ఉన్న వాళ్లకు ఎంట్రీ చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ ఆరంగ్రేటం అదిరినా, అది కొనసాగించలేక మధ్యలోనే కెరీర్‌ ను ముగించేసిని వాళ్లు లెక్కకు మించి ఉన్నారు. అందులో స్టార్ వారసులు కూడా ఎక్కువగానే ఉన్నారు.

    అయితే ఇక్కడ ఇంకో కేటగిరి ఉంది, సినిమాల్లోకి గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకుని ఎదిగే క్రమంలో మళ్ళీ ట్రాక్ తప్పి ఫామ్ కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. కొన్నాళ్ళు విపరీతమైన ప్రయత్నాలు మొదలుపెట్టి.. అప్పటికీ సరైన ఆఫర్లు రాక, ఇక వెక్స్ అయిపోయి వెండితెరను వదులుకున్న స్టార్ల పిల్ల‌లు వీరిలో మరీ ఎక్కువ.

    కాగా తాజాగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కూతురు ‘కార్తీక నాయ‌ర్’ కూడా ఇప్పుడు సినిమాల పై విరక్తి చెందింది. అందుకే, ఇక సినిమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ‘జోష్’లో నాగచైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ త‌ర్వాత జీవా హీరోగా వచ్చిన ‘రంగం’ సినిమాలో నటించి మెప్పించింది.

    ఆ తరువాత ఎన్టీఆర్‌ సరసన ‘దమ్ము’లో నటించినా ఆ సినిమా ప్లాప్ కారణంగా ఇక అప్పటి నుండి ఈ బ్యూటీకి ఛాన్స్ రావడం కష్టం అయిపోయింది. కొన్నాళ్ళు పాటు తన తల్లి సహకారంతో అవకాశం కోసం ప్రయత్నాలు చేసినా అవి ఏవి వర్కౌట్ అవ్వలేదు. అందుకే గత కొంత కాలంగా కార్తీక సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎలాగూ ఆఫర్లు కూడా లేవు కాబట్టి, ఇక నటనకు గుడ్‌ బై చెప్పాల‌ని నిర్ణయించుకుంది.