
Samantha – Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా సమంత తీవ్రమైన నెగటివిటీ ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.నాగ చైతన్య ని ఒక్కరు కూడా తప్పుబట్టకపోవడం విశేషం.విడాకులు తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు.వీళ్లిద్దరు ప్రైవేట్ పార్టీలకు కలిసి వెళ్లడం,హాలిడే ట్రిప్స్ కి వెళ్లడం,డిన్నర్లకు వెళ్లడం ఇలా ఎన్నో చేస్తూ కామెర్లకు చిక్కారు.
కానీ నాగ చైతన్య ని నెటిజెన్స్ ఏమాత్రం తప్పుబట్టట్లేదు కానీ, తన పనేదో తాను చేసుకుంటూ పోతున్న సమంత ని మాత్రం ఇప్పటికీ ట్రోల్ల్స్ చేస్తూనే ఉన్నారు.దీనిపై సమంత కూడా పలుమార్లు స్పందించింది.మరోపక్క సమంత నాగ చైతన్య తో రిలేషన్ లో ఉన్నప్పుడు నడుము అంచున పైన నాగ చైతన్య పేరు తో టాటూ వేయించుకుంది.ఈ టాటూ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.సమంత రీసెంట్ గా పెట్టిన ఫోటోలలో కూడా ఆ టాటూ ని మనం చూడవచ్చు.
రీసెంట్ గా ఆమె అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రీమియర్ కి హాజరైంది.ఈ ప్రీమియర్ లో ఆమె ధరించిన దుస్తులు మరియు హెయిర్ స్టైలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అయితే ఆమె వేసుకున్న దుస్తుల కారణం గా నాగ చైతన్య పేరు తో వేయించుకున్న టాటూ కనిపిస్తూనే ఉంది.
అలాంటి దుస్తులు వేస్తె ఆ టాటూ కనిపిస్తుంది అని తెలిసి కూడా సమంత కావాలనే ఆ దుస్తులను ధరించిందా, దీనిని బట్టీ చూస్తుంటే సమంత ఇప్పటికీ నాగ చైతన్య ని మర్చిపోలేకపోతుందా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.మరోపక్క సమంత ని ద్వేషించేవాళ్ళు దీని మీద కూడా ఆమె పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.కావాలనే సింపతీ డ్రామా కోసం సమంత ఇలా చేస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు.మరి వీటికి సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.