Priyanka Chopra : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. అయితే ఒకప్పుడు ఈ బ్యూటీ చాలా సినిమాల నుంచి తప్పుకుంది. మరి ఎందుకు కొన్ని సినిమాల్లో ఈ బ్యూటీ అసలు కనిపించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, సూపర్ హిట్ చిత్రం గదర్ దర్శకుడు అనిల్ శర్మ ప్రియాంక చోప్రా ఎందుకు బ్రేక్ తీసుకుందో తెలిపాడు. దానికి సంబంధించిన విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అందంగా కనిపించాలి అని ముక్కుకు సంబంధించిన సర్జరీ చేయించుకుందట ప్రియాంక. అయితే అది వికటించడం వల్ల చాలా సినిమాలు ఆమె చేతిలో నుంచి వదులుకుందట. అంతేకాదు కొందరు సినిమాల నుంచి తీసేశారట కూడా. అయితే సర్జరీ తర్వాత ముక్కు చెడిపోవడంతో చాలా సినిమాల నుంచి తప్పుకుంది. అందుకే తన కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రియాంకకు తాను కూడా సహాయం చేశానని చెప్పారు అనిల్. తన కెరీర్ ను తిరిగి ప్రారంభించడానికి ఆమె తిరిగి బరేలీకి వచ్చి కోలుకోవడానికి ఒక సంవత్సరం పట్టిందట. ఆ ముంబై నుంచి బయలుదేరాలని ఆలోచిస్తోందట. కాని అనిల్ చివరి క్షణంలో ఆమెను ఆపాడట అనిల్. ప్రియాంక సత్తా ఏంటో తనకు తెలుసు అని అందుకే ఆమెతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఈ డైరెక్టర్.
అయితే ప్రియాంక చోప్రాకు ముక్కు సర్జరీకి ముందే రూ. రూ.5 లక్షల ఇచ్చాడట డైరెక్టర్. అయితే ఆ చెక్కు తిరిగి ఇవ్వడానికి వెళ్లిందట బ్యూటీ. తనను సినిమా నుంచి తొలగించారని అందుకే తాను తిరిగి బరేలీకి వెళ్తున్నానని ప్రియాంక తెలిపిందట. కేవలం తన డబ్బు తిరిగి ఇచ్చేందుకే వచ్చాను అని చెప్పింది. అయితే వెంటనే డైరెక్టర్ అనిల్ మాత్రం డబ్బులు ఉంచుకోమని చెప్పి చిన్నగా తిట్టారట.
ప్రియాంక తండ్రి కూడా అప్పటికే బరేలీకి తిరిగి వచ్చారని, మళ్లీ సైన్యంలో విధుల్లో చేరారని ప్రియాంక గుర్తుచేసుకున్నారట. తల్లి కూడా మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభిస్తాను అని తెలిపిందట. ఎందుకంటే ప్రియాంక కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు విరామం తీసుకోవాలి అనుకుందట. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలి అనుకుందట. అయితే వారు అంబానీలు కాదని చాలా సామాన్యులు అని ఎక్కువ అద్దె కూడా చెల్లిస్తున్నారు అని తెలిపాడు డైరెక్టర్ అనిల్. అందుకే తిరిగి వెళ్లే ఆలోచన మానుకోవాలి అని సినిమాల్లో నటించమని అడిగారట అనిల్.
YRFలో పని చేస్తున్న ఒక అనుభవజ్ఞుడైన మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిచి ప్రియాంక చోప్రా ముక్కు కోసం సహాయం అడిగారట అనిల్ శర్మ. పని పూర్తయిన తర్వాత, ఆమె నీతా లుల్లా దుస్తులతో ప్రయోగాలు చేసిందట. ఈ డైరెక్టర్ మళ్లీ స్క్రీన్ టెస్ట్ పెట్టారట. ఆ స్క్రీన్ టెస్ట్ CD పంపాను తీసుకెళ్లి చిత్ర టీమ్ కు చూపిస్తే ఈ అమ్మాయి ఎవరు అని అందరూ ఆశ్చర్యపోయారట. ఇది ఆమె విధి అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ అనిల్.