https://oktelugu.com/

పాపం.. బోయపాటికి ఆప్షన్ లేకపాయే !

కరోనా బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ కారణంగా బోలెడు ఖాళీ సమయం దొరకడం.. దాంతో ఏమి చేయాలో తెలియక బాలయ్య ప్రస్తుతం చేస్తోన్న సినిమా కథ గురించి ఆలోచనలు చేయడం.. మరి బాలయ్య ఆలోచనలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాలా.. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది బోయపాటికి. అసలుకే బాలయ్యకి నచ్చింది నచ్చలేదు అని చెబితేనే.. బాలయ్యలోని యాక్షన్ చూడాల్సి వస్తోంది. పోనీ, బాలయ్య చెప్పిందల్లా తీసుకుంటూ పోతే.. మరో […]

Written By:
  • admin
  • , Updated On : July 8, 2020 / 07:48 PM IST
    Follow us on


    కరోనా బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ కారణంగా బోలెడు ఖాళీ సమయం దొరకడం.. దాంతో ఏమి చేయాలో తెలియక బాలయ్య ప్రస్తుతం చేస్తోన్న సినిమా కథ గురించి ఆలోచనలు చేయడం.. మరి బాలయ్య ఆలోచనలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాలా.. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది బోయపాటికి. అసలుకే బాలయ్యకి నచ్చింది నచ్చలేదు అని చెబితేనే.. బాలయ్యలోని యాక్షన్ చూడాల్సి వస్తోంది. పోనీ, బాలయ్య చెప్పిందల్లా తీసుకుంటూ పోతే.. మరో వినయ రామ అంటూ.. భారీ డిజాస్టర్ తీయాల్సి వస్తోంది. మరి ఏమి చేయాలి ? అందుకే బాలయ్య ఆలోచనల మేరకు బోయపాటి కథలో మార్పులు చేసుకుంటూ.. ఆ విధంగా ముందుకు పోతున్నాడు. కాగా తాజాగా స్క్రిప్ట్ లో చేసిన కొత్త మార్పులను బాలయ్య చెప్పిన ప్రకారమే చేసి బాలయ్యకి వినిపించారట.

    1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

    అయితే బాలయ్య మాత్రం లేటెస్ట్ వర్షన్ పై ఎలాంటి కామెంట్లు చేయలేదని.. అసలు బాగుందా.. బాగాలేదా.. అనేది కూడా బాలయ్య చెప్పలేదని.. తెలుస్తోంది. పాపం బోయపాటి ‘వినయ విధేయ రామ’ హిట్ అయి ఉంటే.. ఈ పాటికి పదిహేను కోట్ల డైరెక్టర్ గా తానూ చెప్పిందే శాసనం అనేవాడు. కానీ ప్లాప్ దెబ్బకు బోయపాటికి అప్షన్ లేకుండా పోయింది. ఇక ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే డబల్ యాక్షన్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ నెటిజన్లను బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

    నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

    ఇక ఈ చిత్రం తరువాత షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో చేయడానికి ప్రస్తుతం సెట్స్ వేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కూడా ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన అమలాపాల్ అండ్ ఓ కొత్త హీరోయిన్ హీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోంది. తరువాత షెడ్యూల్ లో తీయబోయే సాంగ్స్ కూడా అమలాపాల్ – బాలయ్య మీద తీస్తారట. అలాగే ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ సెకండ్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడని.. శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి బోయపాటి ఈసారి కూడా బాలయ్యకు సూపర్ హిట్ ఇస్తాడా.. అన్నట్టు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.