https://oktelugu.com/

అర్ధరాత్రి ఆ హోమం కేసీఆర్ ఎందుకు చేయించారు?

ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ సెక్రటేరియట్ కాలగర్భంలో కలిసిపోబోతోంది. వాస్తు సరిగా లేదని కేసీఆర్ ఈ పురాతన, కొత్త భవనాలను కూడా కూల్చివేయిస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అర్థరాత్రే పనులు మొదలుపెట్టారు. సచివాలయం కూల్చివేత ఇప్పటికే ప్రారంభమైంది. కొద్దిరోజుల్లోనే మొత్తం నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంటుంది. 1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా? అయితే ఈ సచివాలయం కూల్చివేతకు ముందు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రహస్యంగా సాగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం కూల్చివేతను మొదలుపెట్టడాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2020 / 07:38 PM IST
    Follow us on


    ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ సెక్రటేరియట్ కాలగర్భంలో కలిసిపోబోతోంది. వాస్తు సరిగా లేదని కేసీఆర్ ఈ పురాతన, కొత్త భవనాలను కూడా కూల్చివేయిస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అర్థరాత్రే పనులు మొదలుపెట్టారు. సచివాలయం కూల్చివేత ఇప్పటికే ప్రారంభమైంది. కొద్దిరోజుల్లోనే మొత్తం నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంటుంది.

    1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

    అయితే ఈ సచివాలయం కూల్చివేతకు ముందు చాలా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రహస్యంగా సాగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం కూల్చివేతను మొదలుపెట్టడాన్ని చాలా రహస్యంగా ఉంచింది. ఇది కొద్దిమంది సీనియర్ అధికారులకు మాత్రమే తెలుసునట.. కూల్చివేతపై నిర్ణయం తీసుకునే స్థలంలో ఆ ఉన్నతాధికారులంతా సైలెంట్ గా ఉండి ఈ పనులు దగ్గరుండి కానిచ్చేశారట..

    తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి  4 గంటల వరకు సచివాలయంలో ఉండి ఈ మంత్రాంగం నడిపారని తెలిసింది. ఈ క్రమంలోనే కొన్ని కార్యక్రమాలను సైలెంట్ గా నిర్వహించారు.

    సచివాలయాన్ని కూల్చివేసే ముందు అందులోని నల్లపోచమ్మ గుడితోపాటు.. మసీదును కూల్చాల్సిన అనివార్యపరిస్థితులు నెలకొన్నాయి. ఇది సెంటిమెంట్ రాజేసే అంశం కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే రహదారులన్నీ బంద్ చేసి.. రాకపోకలు నిలిపివేసి అర్ధరాత్రి డీజీపీ, సీఎస్ దగ్గరుండి మరీ నల్లపోచమ్మ టెంపుల్లో పెద్ద ఎత్తున హోమం నిర్వహించి ఆలయంలోని మూలవిరాట్టును అక్కడి నుంచి తరలించారట.. ఇక ముస్లిం మత పెద్దలను పిలిపించి మసీదులోని మత గ్రంథాల్ని అప్పగించి కూలగొట్టించారట.. తెల్లవారుజామున 4 గంటల వరకు రాష్ట్ర సీఎస్, రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ సచివాలయం వద్దనే ఉండి మీడియాకు, స్థానికులకు ప్రవేశం లేకుండా ఈ తంతును రాత్రి 12 గంటలకు మొదలుపెట్టి ఉదయం 4 వరకు పూర్తి చేశారట..

    నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!

    మరీ ముఖ్యంగా రహస్యంగా కూల్చివేతలు, ప్రార్థనాలయాలు కూల్చివేతల వెనుక సీఎం కేసీఆర్ ఆదేశాలే కారణమని తెలుస్తోంది. హిందూ, ముస్లింల ఆలయాలు కావడంతో చాలా మంది వీటిని తీయనీయకుండా గొడవ చేస్తారు. అటు బీజేపీ, ఇటు ఎంఐఎం ముస్లింలతో గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. నల్లపోచమ్మ ఆలయం సీఎం గదికి చాలా దగ్గరలో ఉంటుంది. అందుకే అందరూ నిద్రపోయాక రాత్రి హోమం ప్రారంభించి కొద్దిమంది అధికారులు మాత్రమే అక్కడ ఉండి ఈ పనులు పూర్తి చేశారట.

    తెల్లవారుజామన ఈ పనులు చేస్తే మీడియా అలెర్ట్ తక్కువగా ఉంటుంది. పైగా ప్రింట్ మీడియా 12 గంటలకే క్లోజ్ అవుతుంది. సో వార్త వచ్చేసరికి మరుసటి రోజు అవుతుంది. ఇలా అందరూ నిద్రపోయిన వేళ రహస్యంగా సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయం, మసీదును పూజలు చేసి కూల్చివేయించారట కేసీఆర్. కొత్త సచివాలయానికి అడ్డు రాకుండా ఈ ప్లాన్ చేశారట..

    తెల్లవారేసరికి ప్రతిపక్షాలు, మీడియా నిరసన తెలుపడానికి రెడీ అయ్యేలోగానే ఈ ఆలయం, మసీదు లేకుండా మొత్తం నేలమట్టమైంది ఇలా కేసీఆర్ ఎంతో చాకచక్యంగా సచివాలయం విషయంలో పట్టుదలతో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ పనులు చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.