సినీ పరిశ్రమలకు 2020 అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోనుందా.. ? సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు లేవు. మొదటిసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో.. ఈ కష్ట కాలాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక సినీ పెద్దలే చేతులెత్తేశారు. సినిమాని నమ్ముకుని బతుకుతున్న బతుకులకు ఇక భరోసా లేనట్లే. సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవుతాయో తెలీదు. కానీ అందరి ఆశ మాత్రం దసరానే. కరోనా మహమ్మారి సమ్మర్ ని మింగేసి.. సమ్మర్ లో రావాల్సిన సినిమాలను అయోమయంలో పడేసింది. అయితే సమ్మర్ సీజన్ పోయినా.. మరో రెండు నెలలు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయని సినీ కార్మికులు ఇన్నాళ్లు ఆశతో బతికారు.
1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?
వారి ఆశకి ఒక కారణం ఉంది, సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని సినిమాలను రిలీజ్ చేయడం, కొత్త సినిమాలను మొదలుపెట్టడం సినిమా ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ సారి ఆ ఆనవాయితీ గతి కూడా తప్పబోతుందా అనే భయం కలుగుతుంది. కష్టాల్లో మునిగిపోయిన సినీ జనానికి.. దసరా సీజన్ పై కూడా నమ్మకం పోతుంది. ఫోన్ ఆన్ చేస్తే చాలు… ఈ రోజు ఇన్ని వందల కేసులు.. ఆ హాస్పటల్ లో బెడ్ లు లేవు, ఆ ప్రభుత్వం కరోనాని పట్టించుకోకుండా ప్రజలకే వదిలేసింది లాంటి మెసేజ్ లు రెగ్యులర్ గా చూసాక కూడా ఇక హోప్స్ ఏమి ఉంటాయి.
నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!
మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి.. ? ఏ రంగంలోని కార్మికులకైనా ఏదొక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఒక్క సినిమా రంగంలోని వారికే.. సినిమా గురించి తప్ప మరోదాని గురించి తెలీదు. స్టార్ హీరోలు కొంతవరకూ సీసీసీ అని పెట్టి ఆదుకున్నా.. ఇంకా ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. పైగా వచ్చే దసరా సీజన్ కూడా కరోనా దెబ్బకు సైడ్ అయిపోతే.. టాలీవుడ్ భారీ సంక్షోభానికి పునాదిగా మారిపోతుంది. మరి దసరా సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. కానీ వాస్తవ పరిస్థితులు సరిచూసుకుంటే అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా లేదు.