Ravi Teja Mass Jathara: కరోనా లాక్ డౌన్ తర్వాత నిర్మాతగా అత్యధిక విజయాలను చూసి, అతి తక్కువ సమయంలోనే స్టార్ నిర్మాత గా మారిన వారు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నాగవంశీ(Nagavamsi). ఇతని ఇంటర్వ్యూస్, ఇతను ఇచ్చే ప్రసంగాలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అవుతుంటాయో మనం ప్రతీరోజూ చూస్తూనే ఉన్నాం. చాలా యాటిట్యూడ్ తో, పొగరుతో మాట్లాడుతున్నట్టు గా అనిపిస్తూ ఉంటుంది ఇతని మాటలు చూస్తుంటే. కొంతమంది ఆ యాటిట్యూడ్ ని మెచ్చుకుంటారు, మరికొంత మంది మాత్రం ఎప్పుడూ తిడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఆయన మాట్లాడే మాటలు ఆయన నిర్మిస్తున్న సినిమాలపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రీసెంట్ సమయం లో ఆయన ‘వార్ 2′(War 2 Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే.
Also Read: తెలుగులో ఇప్పటి వరకు ఒకే థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏంటో తెలుసా..?
ఆయన మతాల కారణంగానే సినిమా ఫ్లాప్ అయ్యిందని చాలా మంది అంటున్నారు. సోషల్ మీడియా లో నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలను అప్లోడ్ చేస్తూ, సినిమా ఫ్లాప్ అయితే ఫోన్ చేసి బండబూతులు తిట్టమన్నావు కదా, ఇదిగో తిడుతున్నాం అంటూ ఎన్నో వందల మీమ్స్ చేసి నాగవంశీ ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ఇప్పటికైనా బలుపు మాటలు తగ్గించుకుంటే మంచిది అని నాగవంశీ చిన్న నాన్న చిన్న బాబు ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘వార్ 2’, ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రాలకు ముందు నాగవంశీ సినిమా అంటే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందుకంటే ఆయన సక్సెస్ ట్రాక్ అలాంటిది మరీ. అయితే ఈసారి మాత్రం ఆయన ప్రొడక్షన్ హౌస్ నుండి రాబోతున్న ‘మాస్ జాతర’ ని కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ అసలు ముందుకు రావడం లేదని టాక్.
‘వార్ 2’ మిగిలించిన భారీ నష్టాలు కారణం చేతనో, లేకపోతే రవితేజ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ రావడం వల్లనో ఏమో తెలియదు కానీ ఈ చిత్రానికి బయ్యర్స్ లేకపోవడం తో ఆగష్టు 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కొంతమంది అయితే నాగవంశీ నోటి దురుసు కారణంగా ఆయన సినిమాలపై నెగటివిటీ పెరుగుతున్న కారణంగా, భవిష్యత్తులో ఆయన నిర్మిస్తున్న సినిమాలను కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. వీటిలో నిజానిజాలు ఏంటో ఇప్పుడే చెప్పలేము కానీ, నాగవంశీ మాత్రం ఈ ఏడాది మొత్తం మీడియా కి, సోషల్ మీడియా కి దూరం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. తన కుటుంబ సభ్యుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎన్ని రోజులు నాగవంశీ తన నోటికి తాళం బిగిస్తాడు అనేది. ఇప్పుడు మాస్ జాతర(Mass Jathara) వాయిదా పడడం వల్ల హీరో రవితేజ(Mass Maharaja Raviteja) కి కూడా కోట్లలో నష్టం వాటిల్లింది. ఎందుకంటే ఆయన ఇంకా రెమ్యూనరేషన్ తీసుకోలేదు, లాభాల్లో వాటాలు పంచుకుందాం అనుకున్నాడు, చివరికి ఇలా అయ్యింది.