Coolie Rachita Ram: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు 151 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి రెండవ రోజున 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 236 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. కానీ ఈ సినిమాకు పబ్లిక్ లో ఆశించిన స్థాయి లో టాక్ లేదనే చెప్పాలి. యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ టాక్ ఉంది. ఈ టాక్ తోనే ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయంటే ఇక జైలర్ రేంజ్ టాక్ వచుంటే ఏ రేంజ్ వసూళ్లు వచ్చి ఉండేవో మీరే ఊహించుకోండి. ఇక పోతే ఈ సినిమాలో నటించిన నటీనటులందరినీ అంత తేలికగా మర్చిపోవడం కష్టం.
Also Read: ఈ దర్శకులు క్లాస్ సినిమాలు చేస్తేనే సక్సెస్ సాధిస్తారా..?
ముఖ్యంగా మలయాళం నటుడు సౌబిన్ సాహిర్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన మరో హీరో అనొచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఈ చిత్రం లో నటించిన నటీనటుల్లో మంచి పేరు తెచ్చుకున్నది ఈయన మాత్రమే. ఆయన వల్లే ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా సూపర్ హిట్ అయ్యింది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన తర్వాత ఆడియన్స్ ని షాక్ కి గురి చేసిన పాత్ర కళ్యాణి. కన్నడ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె పేరు రచిత రామ్(Rachita Ram). ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఇచ్చిన ట్విస్ట్ ని చూసి థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈమెని ఇంతకు ముందు మన తెలుగు ఆడియన్స్ చూడలేదు.
కానీ ఈమె మెగా ఫ్యామిలీ హీరో తో ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా నటించిన ‘సూపర్ మచ్చి’ అనే చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోవడం తో ఈమె మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అవ్వలేదు. అత్యధిక శాతం ఈమె కన్నడ లోనే హీరోయిన్ గా చేసింది. ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రాన్ని కన్నడలో దర్శన్ ‘బుల్ బుల్’ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రం ద్వారానే ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో వరుసగా అవకాశాలను సంపాదిస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ కన్నడ నెంబర్ 1 హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో 5 కన్నడ సినిమాలు ఉన్నాయి.