https://oktelugu.com/

Actress: అందం అభినయం ఉన్న అదృష్టం కూడా ఉండాలేమో..ఈ హీరోయిన్ పరిస్థితి అలానే ఉందిగా…

ఒకప్పుడు హీరోయిన్లు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగే వారు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వచ్చి వాళ్ల పేరు ప్రేక్షకులకు తెలిసేలోపే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 02:35 PM IST

    Raashi Khanna

    Follow us on

    Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఎలా ఉన్నా కూడా హీరోయిన్లకి మాత్రం కొంతవరకు కష్టంగానే ఉంటుందని చెప్పాలి. ఒక సినిమాతో సక్సెస్ వస్తే వాళ్లకి ఒకసారిగా చాలా ఆఫర్లు వస్తాయి. అలాగే ఒక రెండు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం వాళ్లకి ఆఫర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఇక ఐరన్ లెగ్ అనే ముద్ర ని కూడా వేస్తారు. హీరోయిన్లు ఇలా రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తుంటారు.

    ఇక ఒకప్పుడు హీరోయిన్లు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగే వారు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వచ్చి వాళ్ల పేరు ప్రేక్షకులకు తెలిసేలోపే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక మరికొంతమంది మాత్రం అవకాశాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక అందులో రాశికన్నా ఒకరు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి ఇప్పటివరకు మంచి విజయాలు అందుకుంటూ వచ్చింది.

    మధ్యలో కొద్ది వరకు ప్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఆమె అందం లో గాని, అభినయంలో గాని ఎక్కడ కూడా తగ్గకుండా ప్రేక్షకులను మెప్పిస్తు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో ఎంత అందం ఉన్న, ఎంత అభినయం ఉన్నా సినిమాల సక్సెస్ రేట్ లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. అలాగే ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు అయితే రాదు. ఇక రాశిఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది అని అందరు అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతుంది. ఇక పక్కా కమర్షియల్, థాంక్యూ లాంటి రెండు భారీ డిజాస్టర్ ల తర్వాత ఆమె దాదాపు రెండు సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. ఇక ఈ క్రమం లోనే బాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమా కోసం తనని హీరోయిన్ గా తీసుకున్నారు.

    అయితే ముందుగా ఈ సినిమాలో రష్మిక మందాన ను హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ, ఆమెకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత శ్రీలీలా ను హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ నితిన్ శ్రీలీల కాంబో లో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్లాప్ అయింది. అందుకని నితిన్ శ్రీలీలా కాంబినేషన్ వర్కౌట్ అవలేదు కాబట్టి ఇప్పుడు రాశిఖన్నాని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అయితే నితిన్ రాశి కన్నా కాంబినేషన్ లో ఇంతకు ముందు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా వచ్చింది ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాతో అయిన నితిన్, రాశిఖన్నాల కాంబో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా మిగిలి పోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…