Homeఎంటర్టైన్మెంట్Rajamouli-Mahesh: మొదటిసారి కలిసిన మహేష్-రాజమౌళి... దుబాయ్ లో ఏం జరిగిందంటే?

Rajamouli-Mahesh: మొదటిసారి కలిసిన మహేష్-రాజమౌళి… దుబాయ్ లో ఏం జరిగిందంటే?

Rajamouli-Mahesh: కెరీర్లో మొదటిసారి కలిసి మూవీ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుండగా మహేష్ బాబు-రాజమౌళి భేటీ అయ్యారు. 2020లో రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అని కన్ఫర్మ్ చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ షూట్ కి బ్రేక్ పడింది. ఆ సమయంలో ఓ మీడియా ఛానెల్ రాజమౌళిని వీడియో ఇంటర్వ్యూ చేసింది.

తదుపరి ప్రాజెక్ట్ మహేష్ తో చేస్తున్నాను. కే ఎల్ నారాయణ నిర్మాతగా ఉంటారు. కే ఎల్ నారాయణ మహేష్ తో మూవీ కోసం చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చారు. అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ తో మూవీ చేస్తానని రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ప్రకటన జరిగి నాలుగేళ్లు అవుతుండగా మొదటిసారి మహేష్ బాబు-రాజమౌళి కలిశారు.

దుబాయ్ లో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీలో మహేష్ బాబు కి రాజమౌళి ఫైనల్ స్క్రిప్ట్ నేరేట్ చేసినట్లు సమాచారం. వీరితో నిర్మాత కే ఎల్ నారాయణ కూడా జాయిన్ అయ్యారు. రాజమౌళి స్క్రిప్ట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ ఫైనల్ చేశాడట. ఇక మహేష్ లుక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ ఎప్పటి నుండి మొదలు వంటి కీలక విషయాలు చర్చకు వచ్చాయట. దుబాయ్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా ముగిసినట్లు టాలీవుడ్ వర్గాల వాదన.

చర్చలు ముగిసిన నేపథ్యంలో రాజమౌళి-మహేష్ బాబు హైదరాబాద్ లో అడుగుపెట్టారు. కాగా మహేష్ లేటెస్ట్ లుక్ కిక్ ఇస్తుంది. లాంగ్ హెయిర్, గడ్డంతో ఆయన సరికొత్తగా కనిపించాడు. రాజమౌళి తన ప్రతి సినిమాలో హీరోని గత చిత్రాలకు భిన్నంగా చూపిస్తాడు. ఈ మధ్య సిక్స్ ప్యాక్ తప్పనిసరి చేశాడు. మహేష్ ని ఎలా చూపిస్తాడనే ఆత్రుత అందరిలో ఉంది. మహేష్ ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ చేయలేదు.

ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 800 కోట్లకు పైమాటే అంటున్నారు. కే ఎల్ నారాయణతో పాటు మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉంటారనే చర్చ నడుస్తుంది. ఇక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందని రాజమౌళి తెలియజేశారు. హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తరహా కథ సిద్ధం చేశారట. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారని సమాచారం.

Exit mobile version