ester noronha childhood pics
Guess the Actress: పైన ఫోటోలో స్కూల్ యూనిఫార్మ్ లో రెండు జడలు వేసుకుని క్యూట్ గా నవ్వుతున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటికే పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మితిమీరిన గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూ ఈ హాట్ బ్యూటీ కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. తెలుగులో భీమవరం బుల్లోడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆమె ఎవరనేది. ఈ టీనేజ్ గర్ల్ ఎవరో కాదు హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా.
తేజ డైరెక్షన్ లో వచ్చిన వెయ్యి అబద్ధాలు చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు తో గుర్తింపు తెచ్చుకుంది.ఆది సాయి కుమార్ నటించిన గరం ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన జయ జానకి నాయక వంటి చిత్రాల్లో ఎస్తేర్ నటించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఎస్తేర్ నటించారు. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఎస్తేర్ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. సింగర్, డాన్సర్, మ్యూజీషియన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఎస్తేర్ కర్ణాటక లో జన్మించింది. తొమ్మిదేళ్లకే కొంకణి భాషలో పాటలు పాడింది. ఇక 2012లో బారోమస్ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఎస్తర్ కొన్ని బోల్డ్ కంటెంట్ చిత్రాల్లో సైతం నటించింది. అవి యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. కాగా ప్రముఖ సింగర్, ర్యాపర్ నోయెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొద్దిరోజులకే విబేధాలు రావడంతో డివోర్స్ తీసుకున్నారు. ఏడాది కూడా ముగియక ముందే వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు.
విడాకుల తర్వాత ఆమె ఛాంగురే బంగారు రాజా , రెక్కీ , డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్లలో ఆమె గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రల్లో నటిస్తూ యువతను గిలిగింతలు పెట్టింది. త్వరలో టెనెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ డ్రామా తెరకెక్కించారు. టెనెంట్ మూవీ ఏప్రిల్ 19న విడుదల కానుంది.