https://oktelugu.com/

మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

ఈ మధ్య మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం అనేది అస్సలు కలిసి రావడంలేదు, ఈ పాయింట్ దగ్గరే పవన్ ను అవమానిస్తారు. ఇప్పుడు కరెక్ట్ గా ఇదే పాయింట్ దగ్గర బుక్ అయింది మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’. మొదటి రెండు పెళ్లిళ్లు న‌చ్చ‌క విడాకుల బాట ప‌ట్టాయి. అలా అని వ‌నితా ఒంటరిగా ఏమి లేదు. చాల రోజులు ఇప్పుడు చేసుకున్న మూడో భర్తతో సహజీవినం చేసింది. ఈ సారి అన్ని విధాలుగా ముందే చూసుకుని ఆనందంగా […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 / 07:26 PM IST
    Follow us on


    ఈ మధ్య మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం అనేది అస్సలు కలిసి రావడంలేదు, ఈ పాయింట్ దగ్గరే పవన్ ను అవమానిస్తారు. ఇప్పుడు కరెక్ట్ గా ఇదే పాయింట్ దగ్గర బుక్ అయింది మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’. మొదటి రెండు పెళ్లిళ్లు న‌చ్చ‌క విడాకుల బాట ప‌ట్టాయి. అలా అని వ‌నితా ఒంటరిగా ఏమి లేదు. చాల రోజులు ఇప్పుడు చేసుకున్న మూడో భర్తతో సహజీవినం చేసింది. ఈ సారి అన్ని విధాలుగా ముందే చూసుకుని ఆనందంగా పెళ్లి చేసుకుంది.

    కానీ సుఖంగా కాపురం చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతుందట. తన మీద చేస్తోన్న కామెంట్స్ కి తెగ ఫీల్ అవుతుందట.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా తనని మాత్రం వదలడం లేదని తెగ బాధ పడుతుందట.

    Also Read: ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

    నిజమే వనితా చేసిన తప్పు ఏముంది ? ఒక హీరోయిన్ గా మూడు పెళ్లిలు చేసుకోవడం నేరమా ? పెళ్లి కాకుండా లెక్కకు మించి తిరిగేతే తప్పు గానీ, పద్దతిగా పెళ్లి చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె మనోగతం. అయినా జీవితానికో తోడు అవ‌స‌రం అని.. అందుకే తానూ ప్రేమ‌, పెళ్లిళ్ల విష‌యంలో ఎన్నిసార్లు విఫ‌ల‌మ‌వుతున్నా వాటి పై న‌మ్మ‌కాన్ని చంపుకోనని.. అవసరమైతే మరో సారైనా పెళ్లికి సిద్ధం అని ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుందని కోలీవుడ్ మీడియాలో ఈ అవుట్ డేటెడ్ హీరోయిన్ మీద ఛలోక్తులు విసురుతున్నారు క్రిటిక్ రాయుళ్ళు.

    Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !

    ఏది ఏమైనా వివాహ బంధం పై తన ధోర‌ణిని వ‌నితా విజ‌య‌కుమార్‌ స్పష్టంగా చెబుతుంది. ఇక నాలుగేళ్ళు పోతే కూతురు కూడా పెళ్లి ఈడుకొస్తోంది. అయినా పీట‌ర్ పాల్‌ను వ‌నితా మూడో పెళ్లి చేసుకుంది. పీట‌ర్ తో కూడా తేడా వస్తే మరో పెళ్లికి కూడా సిద్ధం అనే రేంజ్ లో వీర వనితా ఆవేశం చూపిస్తుంటే ఆ కార్యం కూడా జరిగేలానే ఉంది. ఏమైనా ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులతో కొత్త జీవితం ఆరంభించాలనే వనితా విశాలమైన హృదయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయినా వ‌నిత‌ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ర‌చ్చ చేయడం మంచి పద్దతి కాదని ఆమె సన్నిహితులు కూడా ఆమెకు కాస్త సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఆమె పై చాటుగా పెదవి విరుస్తున్నారట. మొత్త్తనికి అందరూ కలిసి వనితను సుఖంగా కాపురం చేసుకోనివ్వడం లేదు పాపం.