https://oktelugu.com/

రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

మూడు రాజధానుల విధానంలో భాగంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని రైతుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజధాని రైతులను కొంతైనా సంతృప్తి పరిచేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు, మరికొన్నేళ్లు వారికి కౌలు రూపంలో ఆర్ధిక సాయం కొనసాగించాలనే అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూములు వినియోగించుకున్న ఒక రకంగా, వినియోగించుకోని భూములకు మరో రకంగా ప్యాకేజీలను అమలు చేసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2020 / 07:09 PM IST
    Follow us on

    మూడు రాజధానుల విధానంలో భాగంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని రైతుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజధాని రైతులను కొంతైనా సంతృప్తి పరిచేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు, మరికొన్నేళ్లు వారికి కౌలు రూపంలో ఆర్ధిక సాయం కొనసాగించాలనే అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూములు వినియోగించుకున్న ఒక రకంగా, వినియోగించుకోని భూములకు మరో రకంగా ప్యాకేజీలను అమలు చేసి అమరావతిలోని రైతుల సంతృప్తి చెందే విధంగా చేయాలని భావిస్తోంది. ఇందుకు రైతులతో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి తదనుగుణంగా ఓ నిర్ణయానికి రానున్నారు.

    Also Read: రాజధాని రైతుల కల నెరవేరుతుందా?

    ఇప్పటికే నిర్మించిన భవనాలు, స్పీడ్ యాక్సెస్ రోడ్లు, ఇతర నిర్మాణాలను కొంత మంది రైతుల భూములు వినియోగించుకున్నారు. వారికి లేవుట్ ప్లాట్లు ఇవ్వడంతో పాటు లేవుట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఇక వినియోగించుకోని భూముల విషయంలో ఎవరి భూములు వారి తీసుకుని మళ్లీ సాగు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనల చేస్తున్నారు. మరి కొంత కాలం వీరికి కౌలు చెల్లిస్తారు. దీంతో వారికి ఎటువంటి అభ్యంతరం లేకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ, గుంటూరులకు సమీపంలో ఉంటే ఈ ప్రాంతాలు ఎప్పటికైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రభుత్వం సూచలను అంగీకరిస్తారనే ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన జగన్ తాము అధికారంలోకి వస్తే టిడిపి ప్రభుత్వం తీసుకున్న భూములన్నీ తిరిగి వెనక్కి ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టీ హామీ నిలబెట్టుకున్నట్లు ఉంటుందని అనుకుంటున్నారు.

    Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

    ఇప్పటికే గత ప్రభుత్వం రూ.9,600 కోట్ల వ్యయంతో భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టగా వాటిలో కోన్ని పూర్తయ్యాయి. ఉద్యోగుల భవనాలు, ఐఎఎస్ అధికారుల నివాసాలు, ఎమ్మెల్యేల నివాసలు నిర్మాణాలు ప్రారంభించగా కొన్ని సముదాయాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. కొద్ది రోజుల కిందట పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికారులతో కలిసి ఈ నిర్మాణాలను పరిశీలించారు. ఈ నిర్మాణాలను ఎలా ఉపయోగించుకోవాలని అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. 50 శాతానికి మించి పూర్తయ్యిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వాటిని వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. శాసన రాజధానితోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి పలు ప్రాజెక్టులను కేటాయించడతోపాటు కొన్ని ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవడంతో రైతుల్లో అసంతృప్తిని చల్లారుతుందని దీంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.