Homeఎంటర్టైన్మెంట్Smriti Irani: షోకి పిలిచి 'నో ఎంట్రీ బోర్డు'.. స్మృతి ఇరానికి ఎదురైన చేదు అనుభవం

Smriti Irani: షోకి పిలిచి ‘నో ఎంట్రీ బోర్డు’.. స్మృతి ఇరానికి ఎదురైన చేదు అనుభవం

Smriti Irani: కేంద్ర మంత్రి, ప్రముఖ నటి స్మృతి ఇరానీకీ ఓ షోలో చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిని షోలోనే.. అనుమతి లేదంటూ తిరిగి పంపించేసిన ఘటన ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఇటీవలే పుస్తకాలు రాస్తున్న స్మృతి.. తన బుక్​ను ప్రమోట్​ చేసుకోడవం కోసం.. పాపులర్ టెలివిజన్​ షో.. కపిల్​ శర్మ కామెడీ షోలో అతిథిగా పాల్గొనాల్సి ఉంది. Also Read: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి జనని సాంగ్ విడుదల… గుండెలు పిండేసిన జక్కన్న ఈ […]

Smriti Irani: కేంద్ర మంత్రి, ప్రముఖ నటి స్మృతి ఇరానీకీ ఓ షోలో చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిని షోలోనే.. అనుమతి లేదంటూ తిరిగి పంపించేసిన ఘటన ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఇటీవలే పుస్తకాలు రాస్తున్న స్మృతి.. తన బుక్​ను ప్రమోట్​ చేసుకోడవం కోసం.. పాపులర్ టెలివిజన్​ షో.. కపిల్​ శర్మ కామెడీ షోలో అతిథిగా పాల్గొనాల్సి ఉంది.

Smriti Irani
Smriti Irani

Also Read: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి జనని సాంగ్ విడుదల… గుండెలు పిండేసిన జక్కన్న

ఈ క్రమంలోనే షూటింగ్​లో జాయిన్​ అయ్యిందేకు సెట్స్ వద్దకు రాగా.. అక్కడున్న సెక్యురిటీ ఆమెను లోపలకు అనుమతించలేదట. ఈ షోకు తాను గెస్ట్ అని చెప్పినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదని.. సారీ అంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టారట. దీంతో చేసేదేం లేక.. స్మృతి ఇరానీ వచ్చిన దారినే ఇంటికి వెళ్లిపోయిందట. అయితే, అప్పటికే లోపల షోతో బిజీగా ఉన్న కపిల్​కు ఈ విషయం తెలియదట.

ఆ తర్వాత విషయం తెలిశాక.. సెట్​లో గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే  షూటింగ్​ను ప్యాక్​అప్​ చేసి.. స్మృతిని కలిసి కపిల్​ అండ్​ టీమ్​.. క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఈ ఘటనపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తపిల్​ శర్మ అండ్​ టీమ్​.. కావాలనే ఇలా చేశారని.. స్మృతి ఇరానీ రాజకీయ వేత్త మాత్రమే కాకుండా.. గొప్ప నటి అని.. అలాంటి ఆమెను గుర్తుపట్టని వారుండరని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న షోలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి.. పుకార్లకు చెక్​ పెట్టాలని కపిల్​ శర్మ బావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: అనుభ‌వించు రాజా మూవీ రివ్యూ

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper