KBC13: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోన్న ఈ షో. ఇందులో అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపేందుకు పాల్గొంటుంటారు. ఈ క్రమంలోనే సత్యమేవ జయతే2 హీరోహీరోయిన్లు జాన్ అబ్రహం, దివ్యా ఖాస్తో కుమార్ షోలో సందడి చేశారు. అయితే, బాలీవుడ్ హీరో, కండలవీరుడు జాన్ అబ్రహం ఈ షోలో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. అందులో హాట్‌సీట్‌ను అలంకరించి.. తన సిక్స్‌ప్యాక్‌ను ప్రదర్శించారు జాన్.. దీంతో.. అక్కడున్న వార్తంతా కేకలతో హోరెత్తించారు. వెంటనే నీకు అమ్మాయిలంతా ఫ్యాన్సే అంటూ నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత ధూమ్ సినిమా తర్వాత ఓ సారి అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్లి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జాన్ అబ్రహం.
https://www.instagram.com/p/CWpdzjzqmuS/?utm_source=ig_web_copy_link
Also Read: వామ్మో ఆ హగ్గులేంటి.. పబ్లిక్ గా సిరి పరువు తీసిన తల్లి!
ఈ క్రమంలోనే తన వ్యక్తిగతం జీవితం గురించి చెబుతూ పూర్తి భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రోమోలో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. మరి జాన్ అబ్రహం అంతలా బాధపడటానికి కారణమేంటో తెలియాలంటే రేపు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ప్రస్తుతం ముంబై సాగా సినిమాలో అబ్రహం నటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలై మంచి హిట్ అందుకుంది. కాగా, తాజాగా సత్యమేవ జయతే 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read: ముద్దులు, హగ్గులు దాటి ఏకంగా బెడ్ పైకి… అరె ఏంట్రా ఇది!