Teja Sajja Promotion Tactics : ఒక సినిమాని తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాని జనాలకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. కాబట్టి పాన్ ఇండియాలో కూడా మన సినిమాలకు భారీగా ఆదరణ అయితే దక్కుతోంది. మరి స్టార్ హీరోల సినిమాలకి ప్రత్యేకంగా పబ్లిసిటి చేయాల్సిన పనిలేదు. కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు వస్తున్నప్పుడు మాత్రం భారీగా ప్రమోషన్స్ అయితే చేసుకోవాలి. అలా సినిమా మీద హైప్ క్రియేట్ చేసినప్పుడే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి ఆ సినిమాను చూసే అవకాశాలైతే ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న తేజ సజ్జ మాత్రం ప్రమోషన్స్ చేయడంలో ఎక్కడ తగ్గడం లేదు.
దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాను జనాల్లోకి ఎక్కించి మరీ ఆ సినిమా మీద హైప్ ని ఎలాగైతే క్రియేట్ చేస్తాడో, ఇప్పుడు తేజ సైతం అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది… రీసెంట్ గా ఆయన చేసిన ‘మిరాయి’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా కోసం ఆయన బాలీవుడ్ లో చాలా ఫేమస్ అయిన ‘కపిల్ శర్మ’ ప్రోగ్రాం లో పాల్గొని సినిమా మీద హైప్ అయితే తీసుకొచ్చాడు.
నిజానికి ‘హనుమాన్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన తేజ కి హిందీలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. కానీ సినిమా సినిమాకి ఆ మార్కెట్ ని కాపాడుకుంటూ కొత్తగా సినిమాని చూసే ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే తేజ ‘మిరాయి’ సినిమా కోసం విపరీతమైన కసరత్తులు చేసి మరి ప్రమోషన్స్ అయితే చేసుకున్నాడు. ఇక రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి సక్సెస్ ని సాధించిన వ్యక్తిగా తేజ నిలిచాడు.
మరి అతన్ని చూసి చాలా మంది హీరోలు దర్శకులు సైతం ప్రమోషన్స్ ను ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక బాలీవుడ్ లో సైతం మిరాయి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే అక్కడ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…