Highest Grossing Films in Nizam: మన టాలీవుడ్ కి నైజాం మార్కెట్ ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ హిట్ సినిమాకు వచ్చే వసూళ్ళలో 40 నుండి 50 శాతం నైజాం ప్రాంతం నుండే వస్తాయి. ఈ ప్రాంతం లో టాప్ స్టార్స్ గా ఒకప్పుడు చిరంజీవి(Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) కొనసాగేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్(Rebel Star Prabhas), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఈ ప్రాంతం లో బలంగా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత డే1 ఆల్ టైం రికార్డ్స్ ఈ ముగ్గురి ఖాతాలోనే ఉన్నాయి. అయితే ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడం వల్ల, నైజాం ప్రాంతం ఫుల్ రన్ విషయం లో చాలా వెనుకబడ్డాడు. ఆయన సినిమా ఫుల్ రన్ లో టాప్ 10 కి వచ్చి చాలా కాలమే అయ్యింది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘ఓజీ’ చిత్రం తో పవన్ కళ్యాణ్ టాప్ 10 లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ ప్రాంతం లో 50 కోట్ల షేర్ మార్కుని దాటి టాప్ 10 స్థానాల్లో ఉన్న సినిమాల లిస్ట్ ఇదే.
1) #RRR :
ఎన్టీఆర్,రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా నైజాం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించి, 112 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, ఈ ప్రాంతం లో మొట్టమొదటి వంద కోట్ల షేర్ సినిమాగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డు ని ఎవ్వరూ అందుకోలేకపోయారు.
2)పుష్ప 2(Pushpa 2 The Rule) :
అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్, భారీ అంచనాల నడుమ విడుదలై, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, నైజాం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ రన్ ని సొంతం చేసుకొని 105 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి రెండవ స్థానం లో నిల్చింది.
3) కల్కి 2898 AD(Kalki 2898 AD):
ప్రభాస్ హీరో గా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా, నైజాం ప్రాంతం లో 93 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం టాప్ 3 గా నిల్చింది.
4) సలార్(Salaar : The Cease Fire):
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా, దాదాపుగా 71 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, నాల్గవ స్థానం లో నిల్చింది.
5) బాహుబలి 2(Bahubali 2) :
8 ఏళ్ళ క్రితమే ఈ చిత్రం నైజాం ప్రాంతం లో 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టడం ఒక సంచలనం. పైన చెప్పిన సినిమాలన్నీ రిటర్న్ జీఎస్టీ కలుపుకొని చెప్పినవే. కానీ బాహుబలి 2 కి మాత్రం వర్త్ షేర్ వచ్చింది.
6) ఓజీ(They Call Him OG):
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ చిత్రం ఇప్పటి వరకు నైజాం ప్రాంతం నుండి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. దీపావళి వీకెండ్ వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండడం తో, ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతకు మించి వసూళ్లు వచ్చే అవకాశం లేకపోవడం తో టాప్ 6 స్థానాన్ని ఖరారు చేసుకోవచ్చు.
7) దేవర(Devara):
#RRR వంటి సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రమిది. విడుదలకు ముందే పాటల ద్వారా యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసిన ఈ చిత్రం, విడుదల తర్వాత మంచి ఓపెనింగ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, డీసెంట్ లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుంది. ట్రేడ్ వాస్తవ లెక్కల ప్రకారం ఈ సినిమా కేవలం 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
8) అలా వైకుంఠపురంలో :
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2020 వ సంవత్సరం లో తెరకెక్కిన ఈ సినిమా, ఒక సునామీ ని సృష్టించింది అని చెప్పొచ్చు. అప్పట్లోనే ఈ చిత్రం 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ టాప్ 10 స్థానం లో కొనసాగుతుంది.
9) సంక్రాంతికి వస్తున్నాం:
ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం టాప్ 9 చిత్రం గా నిల్చింది.
10) బాహుబలి:
10 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా, ఇప్పటికీ టాప్ 10 లో కొనసాగుతుంది. దాదాపుగా 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం ఆ రోజుల్లోనే రాబట్టింది అంటే ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఈ టాప్ 10 లిస్ట్ లో ప్రభాస్ ఏకంగా 5 సినిమాలతో డామినేట్ చేస్తున్నాడు. ఆ తర్వాతి స్థానం లో అల్లు అర్జున్ రెండు సినిమాలతో రెండవ స్థానం లో కొనసాగుతుండగా, పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క సినిమాతోనే కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్, ప్రభాస్ లతో పోలిస్తే, పవన్ కళ్యాణ్ లాంగ్ రన్ విషయం లో చాలా వెనుకబడ్డాడు అని అనిపిస్తుంది. రాబోయే సినిమాలతో ఆయన డామినేషన్ చూపించే ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి.