https://oktelugu.com/

Actress Disha Patani: బన్నీతో హాట్ బ్యూటీ ఫిక్స్ !

Actress Disha Patani: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) అంటే.. తనకు ఎంతో ఇష్టం అంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని (Disha Patani). ముఖ్యంగా అల్లు అర్జున్ డ్యాన్స్ కి దిశా ఫ్లాటైపోయింది అట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. దిశా తన పెర్ఫార్మెన్స్ తో […]

Written By:
  • admin
  • , Updated On : September 7, 2021 / 07:23 PM IST
    Follow us on

    Actress Disha Patani: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) అంటే.. తనకు ఎంతో ఇష్టం అంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని (Disha Patani). ముఖ్యంగా అల్లు అర్జున్ డ్యాన్స్ కి దిశా ఫ్లాటైపోయింది అట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. దిశా తన పెర్ఫార్మెన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    టైగర్ ష్రాఫ్ తో ప్రస్తుతం దిశా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ అవుతున్నాయి. పైగా హిందీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లను కూడా అందుకుంటుంది. మొత్తానికి భారీ పాపులారిటీని దిశా సాధించింది. అయినా అవకాశం దొరికిన ప్రతిసారి టాలీవుడ్ హీరోల మీద దిశా తన మక్కువను ఎక్కువగానే ప్రదర్శిస్తూ ఉంది.

    ఇప్పటికీ ఎప్పటికి తెలుగు చిత్రాల్లో అవకాశాలు వస్తే.. కచ్చితంగా తెలుగు సినిమాలు చేస్తాను అంటుంది దిశా. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ కోసం సుకుమార్ టీమ్ ముందుగా దిశా పటానిని సంప్రదించారు.

    కాకపోతే, దిశా మాత్రం సాంగ్ చేయడానికి అంగీకరించలేదు. అల్లు అర్జున్ పక్కన ఐటమ్ సాంగ్ చేయలేను అని, హీరోయిన్ గా అయితే కచ్చితంగా చేస్తాను అంటూ పుష్ప టీమ్ కి చెప్పింది. దాంతో ఇక చేసేది ఏమి లేక పుష్ప మేకర్స్ ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్ సైడ్ అయ్యారు. ఆ సాంగ్ లో ఊర్వశి రౌటేలాను ఫైనల్ చేశారు.

    కానీ దిశా పటాని మాత్రం బన్నీ పక్కన హీరోయిన్ గా నటించబోతోంది. బన్నీ ఐకాన్ సినిమాలో హీరోయిన్ గా దిశాని ఫిక్స్ చేయబోతున్నారట.